22 నుంచి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో 'శ్యామ్ సింగరాయ్' సందడి
నేచురల్ స్టార్ నాని ద్విపాత్రాభినయంలో సాయిపల్లవి, కృతిశెట్టి హీరోయిన్లుగా వచ్చిన చిత్రం "శ్యామ్ సింగరాయ్". గత నెల 24వ తేదీన పాన్ ఇండియా మూవీగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాలం, హిందీ భాషల్లో విడుదలై, మంచి పాజిటివ్ టాక్‌ను తెచ్చుకుంది. ఈ చిత్రం ఈ నెల 22వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
నిర్మాత వెంకట్ బోయినపల్లి నిర్మించిన ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం సమకూర్చగా, రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహించారు. కోల్‌కతాలో 70వ దశకంలో కొనసాగిన దేవదాసీ వ్యవస్థ చుట్టూ ఈ కథ నడుస్తుంది. ఆ కాలాన్ని ప్రతిబింభిస్తూ భారీ సెట్స్ వేసి ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో దేవదాసిగా సాయిపల్లవి నటించారు.
ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. ఏపీలో సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు, 50 శాతం ఆక్యుపెన్సీ వంటి ఆంక్షలు ఉన్నప్పటికీ మంచి కలెక్షన్లను రాబట్టింది. పైగా, నాని ఖాతాలో ఈ చిత్రం ద్వారా మరో విజయం వచ్చి చేరింది. ఈ నేపథ్యంలో ఓటీటీ ఫ్లాట్‌ఫాంలో రిలీజ్ చేయాలని నిర్ణయించారు. ఫలితంగా శుక్రవారమైన 22వ తేదీ నుంచి ఈ చిత్రం నెట్‌ఫ్లిక్ ఓటీటీలో రిలీజ్ కానుంది.