శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 27 జూన్ 2023 (16:06 IST)

నారాయణ అండ్ కో’ కంటెంట్ బావుంది. సుధాకర్ కి బ్రేక్ వస్తుంది: డైరెక్టర్ అనిల్ రావిపూడి

Sudhakar, Anil Ravipudi and others
Sudhakar, Anil Ravipudi and others
హీరో సుధాకర్ కోమాకుల హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘నారాయణ అండ్ కో’. చిన్నా పాపిశెట్టి దర్శకత్వం వహిస్తుండగా, పాపిశెట్టి ఫిల్మ్ ప్రొడక్షన్స్, సుఖ మీడియా బ్యానర్‌ల పై పాపిశెట్టి బ్రదర్స్‌ తో కలిసి సుధాకర్ కూడా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ కి  మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఈ చిత్రం జూన్ 30న విడుదల కానున్న నేపథ్యంలో   చిత్ర యూనిట్ గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ వేడుకలో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, విజయ్ కనకమేడల, హీరో తిరువీర్, నిర్మాత రాజ్ కందుకూరి, ఆర్పీ పట్నాయక్ అతిథులుగా పాల్గొన్నారు.
 
డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ .. ‘నారాయణ అండ్ కో’ టీం అందరికీ బెస్ట్ విషెస్. ట్రైలర్ ఎక్స్టార్డినరీ వుంది. చివరి పంచ్ చాలా బాగుంది. వైబ్ చాలా బావుంది. నేను ఫన్ సినిమాలు ఎక్కువ చేశాను కాబట్టి నాకు జడ్జిమెంట్ బావుందనిపించిది. ఆడియన్స్ కి కూడా నచ్చుతుందనే నమ్మకం వుంది. టైటిల్ రోల్ చేస్తున్న దేవి ప్రసాద్ గారు, ఆమనీ గారు, ఆర్తి, పూజా..టీం అందరికీ బెస్ట్ విషెస్. దర్శకుడు చిన్నాతో పాటు టీం అంతా చాలా హార్డ్ వర్క్ చేసి సినిమా మీద ప్యాషన్ తో తీశారు. కంటెంట్ చాలా బావుంది. సుధాకర్ నా స్నేహితుడు. తనతో నాది లాంగ్ జర్నీ. తనకి లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ తో మంచి టేకాఫ్ వచ్చింది. ‘నారాయణ అండ్ కో’ తో  తనకి మంచి బ్రేక్ వస్తుందని భావిస్తున్నారు. జూన్ 30న సినిమా విడుదలవుతుంది. మిస్ అవ్వకుండా చూడండి’’ అని కోరారు.
 
హీరో సుధాకర్ కోమాకుల మాట్లాడుతూ.. దర్శకుడు చిన్నా ఈ కథ చెప్పినప్పుడు చాలా ఎంజాయ్ చేశాను. చాలా మంచి ఫన్ ఎంటర్ టైనర్ అనిపించి మొదలుపెట్టాం. మధ్యలో కొన్ని అనివార్య కారణాల వలన కాస్త ఆలస్యమైంది. ఆర్ధిక సమస్యలు వచ్చినప్పుడు నా వంతు ఉడుత సాయం చేశాను. ఈ సినిమా చేస్తున్న సమయంలోనే నాకు కొడుకు పుట్టాడు. దురదృష్టవశాత్తు  మూడు నెలల వ్యవధిలో మా నాన్న గారు చనిపోయారు. మా నాన్న ఈ సినిమాకి ఫస్ట్ ఆడియన్. కథ చెప్పినపుడు, సీన్స్ చూపించినపుడు చాలా ఆనంద పడ్డారు, ఆయన ఆశీస్సులు ఉంటాయి. ఆయన కోసం ఈ సినిమా హిట్ ఇవ్వాలి. నా జీవితంలో ప్రధాన వ్యక్తి నా భార్య హారిక. ఆమె సపోర్ట్ తోనే ఈ ప్రయాణం చేయగలుగుతున్నాను. మేము ఇద్దరం కలిసి సుఖ మీడియా బ్యానర్ పెట్టాం. మొదటి ప్రోడక్ట్ గా ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం వుంది. చిన్నా చాలా క్లారిటీ ఉన్న దర్శకుడు. అన్నీ తానై నడిపించాడు. నలుగురు సంగీత దర్శకులు మంచి మ్యూజిక్ ఇచ్చారు. దేవి ప్రసాద్, ఆమనీ గారు, ఆర్తి, పూజా, సప్తగిరి... అందరూ కలసి చేసిన చక్కని ఎంటర్ టైనర్ ఇది. ‘నారాయణ అండ్ కో’ సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ సినిమా. ఖచ్చితంగా మీ అందరికీ  నచ్చుతుంది. అనిల్ రావిపూడి గారు రావడంతో ఈ ఈవెంట్ కి ఒక కళ వచ్చింది. మాది ఎంటర్ టైనర్ ఫిల్మ్. అలాంటి సినిమాలకి బ్రాండ్ అంబాసిడర్ అయిన అనిల్ గారు రావడం చాలా ఆనందంగా వుంది. ఆయనతో నాకు ఎప్పటి నుంచో పరిచయం వుంది. ఇప్పటికే కొన్ని వంద కోట్ల సినిమాలు ఇచ్చారు. ఇప్పుడు బాలయ్య గారితో తీస్తున్న ‘భగవంత్ కేసరి’ వెయ్యి కోట్లు దాటి దద్దరిల్లిపోవాలి. అలాగే ఈ వేడుకకి విచ్చేసిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. జూన్ 30న ‘నారాయణ అండ్ కో’ థియేటర్ లో చూసి మమ్మల్ని బ్లెస్ చేయాలి’’ అని కోరారు.
 
ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ..నాకు తెలిసిన ఒక నిర్మాత ఈ సినిమా చూసి చాలా నచ్చింది, అవుట్ రేట్ కి  కొనాలని అనుకుంటున్నానని నాతో అన్నారు. టీం చాలా కష్టపడి చేసిన సినిమా ఇది. వాళ్ళు లాభాలు చూడాలని దర్శక నిర్మాత చిన్నా ఒక బోల్డ్ నిర్ణయం తీసుకున్నాడు. ఒక నిర్మాతకు అంతలా నచ్చిందంటే సినిమాలో ఏ రేంజ్ వినోదం వుందో అర్ధం చేసుకోవచ్చు. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి. మ్యూజిక్ చాలా బావుంది. సుధాకర్ కి చాలా గొప్ప భవిష్యత్ వుండాలి. టీం అందరికీ ఆల్ ది బెస్ట్’’ తెలిపారు.