ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 7 ఏప్రియల్ 2020 (16:18 IST)

30 రోజుల్లో ప్రేమించడం ఎలా..? ఆ పాటకు 100 మిలియన్ వ్యూస్

Neeli Neeli Aakasam
యాంకర్ ప్రదీప్ గురించి అందరికీ బాగా తెలుసు. బుల్లితెరపై అతనికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ వుంది. ఇంకా సినిమాల్లో కనిపించిన ప్రదీప్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది సినిమాలో కూడా నటించాడు. ప్రస్తుతం 30 రోజుల్లో ప్రేమించడం ఎలా..? సినిమాతో హీరోగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు ప్రదీప్. ఈ సినిమా నుండి వచ్చిన నీలి నీలి ఆకాశం సాంగ్ సూపర్ హిట్ అయ్యింది. ఈ పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.  ఈ సాంగ్ యూట్యూబ్ లో 100 మిలియన్ వ్యూస్ రాబట్టింది. 
 
అనూప్ రూబెన్స్ మ్యూజిక్ చంద్రబోస్ సాహిత్యం రెండు ఈ పాటకు బాగా కుదిరాయి. అందుకే ఈ ఒక్క పాటతో సినిమాపై సూపర్ బజ్ ఏర్పడింది. ప్రదీప్ సరసన అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు మున్నా దర్శకుడు. నిజానికి మార్చి 25న రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా కరోనా ప్రభావంతో వాయిదా పడింది. 
 
ఇప్పటికే షూటింగ్‌లు క్యాన్సిల్ అయిన నేపథ్యంలో సినిమాలు కూడా వాయిదా పడ్డాయి. 21 రోజుల లాక్ డౌన్ తర్వాత పరిస్థితి అందుబాటులో ఉంటే ఓకే కానీ ఇంకా కొనసాగితే మాత్రం థియేటర్ల బంద్ కూడా పొడిగిస్తారు. అలాంటి పరిస్థితుల్లో ప్రదీప్ హీరోగా వస్తున్న ఈ సినిమా ఇతర హీరోలతో పోటీపడుతుందా అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే.