గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 16 సెప్టెంబరు 2019 (16:06 IST)

లేడి సూపర్ స్టార్ కొత్త సినిమా.. ''నెట్రికన్'' అంధురాలిగా నయన

లేడీ సూపర్ స్టార్ నయనతార కొత్త సినిమాకు టైటిల్ ఖరారైంది. ఈ సినిమాకు గృహం ఫేమ్ మిలింద్ రావ్ దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. ఈ సినిమాకు నయనతార ప్రియుడు విఘ్నేశ్ శివన్ నిర్మాతగా వ్యవహరిస్తాడని కోలీవుడ్ వర్గాల సమాచారం. ఈ వార్తలను నిజం చేసేలా ఈ ప్రాజెక్టు పట్టాలెక్కింది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆదివారం మొదలైంది. 
 
తాజాగా ఈ సినిమాకి సంబంధించిన టైటిల్‌ను ఖరారు చేస్తూ ఒక పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాకి ''నెట్రికన్'' అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ పోస్టర్లో బ్రెయిలీ లిపి కనిపిస్తోంది. అలాగే సంకెళ్లు, కొరడా, రక్తపు మరకలు కనిపిస్తున్నాయి. నయనతార అంధురాలిగా కనిపించనుందా అనే ఒక అనుమానం ఈ పోస్టర్‌ను చూసుంటే కలుగుతోంది. 
 
కాగా నెట్రికన్ అనే టైటిల్ సూపర్ స్టార్ రజనీకాంత్ 1981వ సంవత్సరం.. కవితాళయ ప్రొడక్షన్‌పై తెరకెక్కింది. ఈ సినిమా పేరిట ప్రస్తుతం నయన సినిమా చేస్తోంది. రజనీకాంత్ నెట్రికన్ సినిమాను ప్రముఖ దివంగత దర్శకుడు బాలచందర్ తెరకెక్కించారు. తాజాగా నయనతార మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహారెడ్డి సినిమాలో హీరోయిన్‌గా నటించింది.