గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By మోహన్ మొగరాల
Last Modified: సోమవారం, 4 ఫిబ్రవరి 2019 (19:14 IST)

అర్జున్ సురవరంగా 'ముద్ర'ను వేయబోతున్న హీరో నిఖిల్

హీరో నిఖిల్ తాజా చిత్రం టైటిల్ విషయంలో నిర్మాత నట్టికుమార్‌తో నిఖిల్‌కి చిన్నపాటి యుద్ధమే జరిగింది. నట్టి కుమార్ 'ముద్ర' అనే చిత్రాన్ని ఫిల్మ్ ఛాంబర్‌లో రిజిష్టర్ చేసి ఉండడంతో, ముద్ర అనే టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు రావాలనుకున్న నిఖిల్‌కి మధ్య గొడవ తారాస్థాయికి చేరింది. నట్టికుమార్ హీరో నిఖిల్‌పై అసహనం వ్యక్తం చేయడంతో కాస్త వెనక్కి తగ్గిన కుర్ర హీరో 'ముద్ర' టైటిల్‌ని వదులుకున్నాడు. తాజాగా తన చిత్రానికి సంబంధించిన కొత్త టైటిల్‌ను, ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసారు.
 
ఈ చిత్రంలో జర్నలిస్ట్‌ పాత్రను పోషిస్తున్న నిఖిల్ పాత్ర అర్జున్ సురవరం అనే పేరుని చిత్రానికి టైటిల్‌గా పెట్టారు. టీఎన్ సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం తమిళ హిట్ మూవీ కణిథన్‌ని రీమేక్‌గా రూపొందుతోంది. లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఆ చిత్రం మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. మొత్తానికి ముద్ర నుంచి తప్పించుకున్న నిఖిల్‌ ‘అర్జున్‌ సురవరం’ గా రాబోతున్నాడన్న మాట.