దుబాయ్‌లో షూటింగ్ మొదలెట్టిన నితిన్, మేర్లపాక గాంధీ మూవీ
నితిన్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తోన్న చిత్రం షూటింగ్ ఆదివారం మొదలైంది. హీరో హీరోయిన్లు నితిన్, నభా నటేష్‌పై దుబాయ్‌లో సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఫిల్మ్ షూటింగ్ మొదలైన విషయాన్ని తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా తెలియజేసిన నితిన్, సెట్స్ మీద నుంచి ఓ ఫొటోను సైతం షేర్ చేశారు.
"#Nithiin30 shoot starts!! @GandhiMerlapaka @tamannaahspeaks @NabhaNatesh #sagarmahati ," అని ఆయన పోస్ట్ చేశారు. ఫొటోలో ఆయన షర్టుపై స్వెటర్ వేసుకొని పియానో ప్లే చేస్తూ కనిపిస్తున్నారు. ఈ #Nithiin30 మూవీలో తమన్నా భాటియా ఓ కీలక పాత్ర చేస్తున్నారు. జనవరి నుంచి జరిగే తదుపరి షెడ్యూల్ షూటింగ్‌లో ఆమె పాల్గొననున్నారు.
శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్‌పై తయారవుతున్న ఈ ప్రొడక్షన్ నంబర్ 6ను ఎన్. సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి నిర్మిస్తున్నారు. మహతి స్వరసాగర్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి హరి కె. వేదాంత్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి పనిచేస్తున్న మిగతా తారాగణం, టెక్నీషియన్ల వివరాలను వెల్లడించనున్నారు.
సాంకేతిక బృందం:
డైలాగ్స్-డైరెక్షన్: మేర్లపాక గాంధీ
నిర్మాతలు: ఎన్. సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి
బ్యానర్: శ్రేష్ఠ్ మూవీస్
సంగీతం: మహతి స్వరసాగర్
సినిమాటోగ్రఫీ: హరి కె. వేదాంత్
పీఆర్వో: వంరశీ-శేఖర్