నందమూరి మోక్షజ్ఞ తేజకు శుభాకాంక్షలు చెప్పిన ఎన్‌టిఆర్
నందమూరి మోక్షజ్ఞ తేజకు ఈరోజు జన్మదిన సందర్భంగా నందమూరి బాలకృష్ణ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ ఫొటోతో పోస్ట్ చేశాడు. దీంతో అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతూ సందడి చేస్తున్నారు. ఇదే సందర్భంగా ఎన్.టి.ఆర్. జూనియర్ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ, గతంలో ఓ ఫంక్షన్‌లో కలిసిన ఫొటోను పెట్టి అలరించాడు.
నందమూరి మోక్షగ్న తేజ ప్రస్తుతం కాలేజీ చదువుతున్నాడు. తనకు నటుడిగా ఇష్టంలేదని గతంలో వెల్లడించాడు. తను అభీష్టం ఎలా వుంటే అలానే జరుగుతుంది ఎటువంటి ఫోర్స్ వుండదని బాలకృష్ణ పలుసార్లు వెల్లడించారు. మోక్షజ్ఞ ఇప్పటికే జిమ్‌లో బాడీని స్లిమ్‌గా మలుచుకునేదిశలో వున్నాడు. తను స్పోర్ట్‌మెన్‌గా వుండాలనే కోరిక గతంలో ఓ సందర్భంలో వ్యక్తం చేశాడు. చూద్దాం ఏమవుతాడో.