ఆసక్తిని రేకెత్తిస్తున్న శర్వానంద్ - అమలల "ఒకే ఒక జీవితం"
హీరో శర్వానంద్, నటి అమల అక్కినేని తల్లీకుమాడుగా నటించిన చిత్రం "ఒకే ఒక జీవితం". ఈ నెల 9వ తేదీన విడుదలకానుందీ. ఈ చిత్రం ట్రైలర్‌ను శుక్రవారం విడుదల చేశారు. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో సాగే కథతో శ్రీ కార్తీక్ తెరకెక్కించారు. డ్రీమ్ వారియర్ పిక్సర్స్ పతాకంపై నిర్మాత ఎస్ఆర్. ప్రభు నిర్మించారు. రీతూ వర్మ హీరోయిన్. తాజాగా విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ ఎంతో ఆసక్తికరంగా ఉంది.
తల్లీ కొడుకుల మధ్య అనుబంధం.. కాలంలో వెనకికెల్లి తన తల్లిని కలుసుకోవాలనే హీరో కోరిక.. అది ఎలా సాధ్యమైందనే ఆసక్తికరమైన అంశాలతో ఈ ట్రైలర్‌ను కట్ చేశారు. ఇది ఒక ట్రైమ్ ట్రావెల్ మూవీ సినిమా. ఈ తరహా జోనర్‌లో శర్వానంద్ చేసిన తొలి మూవీ ఇదే. ఆయన తల్లిగా అమల నటించగా, ఇతర ముఖ్యమైన పాత్రలను వెన్నెల కిషోర్, ప్రియదర్శి, నాజర్ పోషింటారు. జేక్స్ బిజోయ్ సంగీతాన్ని అందించారు.