ఊ.. అంటావా. ఊఊ అంటావా.. పాట గుట్టు విప్పిన దేవీశ్రీప్రసాద్
అల్లు అర్జున్ నటించిన `పుష్ప` సినిమాలో ఐటెం సాంగ్ లో నటించిన సమంత
ఊ.. అంటావా.. ఊఊ అంటావా సాంగ్ ఎంతో పాపులర్ అయింది. చంద్రబోస్ రాసిన ఈ పాటను సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ స్వరపరిచారు. ఈ పాటకు స్వరాలు ఇలాగే సమకూర్చాలని ఆయన అనుకున్నారట. దాని నేపథ్యం గురించి దేవీశ్రీ తెలియజేశారు.
ఊ.. అంటావా.. అనే పాట కు ప్రేరణ భక్తి గీతాలే. మనం చాలా ఫోక్ సాంగ్స్ వింటుంటాం. కమర్షియల్ సినిమాల్లో ఐటెంసాంగ్ కూ భక్తిభావంతోనే బాణీలు చేస్తాను. దేవుడికి భక్తితో కొలిచినట్లుగా అనుభవిస్తూ ఎటువంటి పాటకైనా స్వరాలు సమకూరుస్తాను. అలాగే `ఊ.. అంటావా.. ఊఊ అంటావా.. ఈ పాటకు అలానే చేశాను. ఈ పాటకు బాణీ ఇలా వుండాలనేది స్పూర్తి ఇచ్చింది ప్రముఖ గాయని శోభారాజుగారే. మా నాన్నగారికి ఆమె గీతాలంటే చాలా ప్రీతి. నాకు ఎంతో ఇష్టం. ఆమె అన్నమయ్య గీతాలు అలవోకగా చక్కటి గాత్రంతో ఆమె ఆలపిస్తుంది.
ఓ సందర్భంలో దేవదేవుని పరవశంతో ధ్యానిస్తూ పాడుతూ.. ఓ చరణంలో ఊ.. అంటావా. స్వామి.. ఊ.ఊ. అంటావా స్వామి.. అంటూ ఆలపిస్తుంది. స్వామివారిని ప్రేమతో వేడుకునే ఈ పాటే నాకు స్పూర్తితో సమంత పాటకు బాణీలు కట్టాను. అంటూ రహస్యాన్ని చెప్పేశారు.