శనివారం, 24 ఫిబ్రవరి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 19 జులై 2022 (22:57 IST)

మళ్లీ రిలీజ్‌కు సిద్ధమైన మహేష్ బాబు పోకిరీ

Pokiri
Pokiri
సూపర్ స్టార్ మహేష్ బాబు పోకిరీ మూవీ మళ్లీ రిలీజ్‌కు సిద్ధం కానుంది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించిన పోకీరీ... 2006 సంవత్సరంలో విడుదలై ఏకంగా 40 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సొంతం చేసుకుంది. 
 
అయితే ఈ సినిమా మళ్లీ థియేటర్లలో రిలీజ్ కానుంది. ఫ్యాన్స్ కు షాకింగ్ గా అనిపించినా మహేష్ బాబు పుట్టినరోజు కానుకగా ఈ సినిమా థియేటర్లలో రీ రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది.
 
ఆగష్టు 9వ తేదీన పరిమిత సంఖ్యలో థియేటర్లలో 4కే రిజొల్యూషన్‌లోకి రీమాస్టర్ చేసి డాల్బీ ఆడియోతో ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయనున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
 
పోకిరి రీ రిలిజ్ విషయంలో డిఫరెంట్ స్ట్రాటెజీని ఫాలో అవుతున్నారని ఎక్కువ సంఖ్యలో థియేటర్లలో ఈ సినిమా రీ రిలీజ్ కానుందని తెలుస్తోంది. పోకిరిని అప్పుడు థియేటర్లలో చూడటం మిస్సైన వాళ్లు సైతం మహేష్ పుట్టినరోజున ఈ సినిమాను థియేటర్లలో చూసే అవకాశం ఉంది. 
 
గతంలో మహేష్ నటించిన పలు సినిమాలు రీ రిలీజ్‌లో కూడా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్‌ను అందుకున్నాయి. మరి పోకిరీ రీ-రిలీజ్‌కు రెస్పాన్స్ ఎలా వుంటుందో వేచి చూడాలి.