బుధవారం, 29 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 27 జనవరి 2025 (18:20 IST)

కన్నప్ప నుంచి త్రిశూలం, నుదుట విబూదితో ప్రభాస్ చూపులు లుక్

Prabhas look sample
Prabhas look sample
విష్ణు మంచు ‘కన్నప్ప’ లో రిలీజ్ చేసిన అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లతో అంచనాలు పెరిగిపోయాయి. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ బ్యానర్‌లపై మోహన్ బాబు భారీ ఎత్తున నిర్మిస్తున్న కన్నప్ప చిత్రానికి సంబంధించిన అసలు సిసలు అప్డేట్ రాబోతోంది. ఈ మేరకు చిత్రయూనిట్ తాజాగా ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
 
ఫిబ్రవరి 3న డార్లింగ్ ప్రభాస్ పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఈ మేరకు రిలీజ్ చేసిన పోస్టర్‌లో ప్రభాస్‌ను అలా కొద్దిగా చూపించి ఊరించారు. ఈ పోస్టర్‌లోని త్రిశూలం, ప్రభాస్ చూపులు, నుదుట విబూదిని చూస్తుంటే ఈ లుక్ కన్పప్ప చిత్రానికే హైలెట్‌గా నిలిచేలా ఉంది. 
 
కన్నప్ప చిత్రం ఏప్రిల్ 25న ఆడియెన్స్ ముందుకు రాబోతోన్న సంగతి తెలిసిందే. కన్నప్ప చిత్రంలో అక్షయ్ కుమార్, మోహన్ లాల్, మోహన్ బాబు, శరత్ కుమార్, బ్రహ్మానందం, కాజల్ అగర్వాల్, ప్రీతి ముకుందన్ ఇలా ఎంతో మంది భారీ తారాగణం నటించింది. ఈ సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు.