సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 30 నవంబరు 2020 (15:00 IST)

ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా..? ఓటీటీలోనా? లేకుంటే థియేటర్‌లలోనా?

బుల్లితెరపై ఓ వెలుగు వెలిగిన ప్రదీప్.. ప్రస్తుతం సినిమాల్లోకి వస్తున్నాడు. ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమా ద్వారా తెరపైకి రానున్నాడు. కానీ కరోనా కారణంగా ఈ సినిమా విడుదల వాయిదా పడుతూ వస్తోంది. ఈ సినిమాలో ప్రదీప్ సరసన యంగ్ బ్యూటీ అమృత అయ్యర్ నటించింది. అంతేకాకుండా ఈ సినిమాకు సుకుమార్ శిష్యుడు మున్నా దర్శకత్వం వహించాడు. 
 
ప్రదీప్‌కు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అభిమానులను దృష్టిలో పెట్టుకొని గీతా ఆర్ట్స్2, మూవీ క్రియేషన్స్ ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఓకే చెప్పాయి. అంతేకాకుండా మొదటగా విడుదలయిన ఫస్ట లుక్‌తో పాటు విడుదలయిన నీలీ నీలీ ఆకాశం పాట కూడా సోషల్ మీడియాను ఉర్రూతలూగించాయి. అయితే ఈ సినిమాను 2020 సమ్మర్‌లో ప్రేక్షకుల ముందు తీసుకురావాలని అనుకున్నారు.
 
కానీ కరోనా రాకతో అదికాస్తా వాయిదా పడింది. దాంతో గత ఎనిమిది నెలలుగా కొత్త సినిమాలు కొన్ని ఓటీటీ బాట పట్టాయి. అదే సమయంలో ఈ సినిమా కూడా ఓటీటీలో విడుదలకు సిద్దం అయిందని వార్తలు వచ్చాయి. అవన్నీ అబద్దాలని ఈ సినిమా మేకర్స్ తేల్చి చెప్పారు. ఇన్నాళ్లు థియేటర్స్‌ కోసం ఎదురు చూసిన వీరు సంక్రాంతి బరిలోకి ఈ సినిమాను దించేందుకు ప్రయత్నిస్తున్నారు. 
 
అయితే ఇప్పటికే సంక్రాంతి బరిలో ఎన్నో సినిమాలు ఉండటంతో ఈ సినిమాకి సంక్రాంతి స్లాట్ కూడా దొరకడం కష్టమేనని అంటున్నారు. అంతేకాకుండా ప్రదీప్‌కు లేడీ ఫాలోయింగ్ ఉంటే ఓటీటీలో విడుదల చేస్తే సరిపోతుందని కూడా కొందరు అంటున్నారు. ప్రస్తుత పరిస్థితులలో మహిళలు థియేటర్ల కాన్నా హోం స్క్రీన్‌పైసినిమాలు చూడటానికే ఇష్టపడుతున్నారు. ప్రదీప్ కూడా ఓటీటీలో విడుదల చేసేందుకు సిద్ధమని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.