మంగళవారం, 3 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 17 నవంబరు 2023 (19:18 IST)

ప్రజాకవి కాళోజీ బయోపిక్ తీయాలంటే గట్స్ కావాలి : ఆర్ నారాయణ మూర్తి

R Narayana Murthy - Director Prabhakar Jaini  and others
R Narayana Murthy - Director Prabhakar Jaini and others
జైనీ క్రియేషన్స్ పతాకంపై మూలవిరాట్, పద్మ,రాజ్ కుమార్, స్వప్న నటీ నటులుగా అమ్మ నీకు వందనం,  క్యాంపస్ అంపశయ్య',  ప్రణయ వీధుల్లో', వంటి  ప్రయోజనాత్మక ' సినిమాలు తీసిన ప్రభాకర్ జైనీ దర్శకత్వంలో శ్రీమతి విజయలక్ష్మీ జైనీ నిర్మించిన చిత్రం 'ప్రజాకవి కాళోజీ' బయోపిక్!. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్దమైన సందర్బంగా  చిత్ర టీజర్, ట్రైలర్ ను విడుదల చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వచ్చిన పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణ మూర్తి, రంగారెడ్డి ఇన్కంటాక్స్ చీఫ్ కమీషనర్ నరసింహప్ప, తెలంగాణ సాంసృతిక సంచాలకులు  మామిడి హరికృష్ణ, నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ ముఖ్య అతిధులుగా పాల్గొని ప్రజాకవి కాళోజీకి జ్యోతి ప్రజ్వాలన చేసి నివాళులు అర్పించారు.
 
ఆర్ నారాయణ మూర్తి  మాట్లాడుతూ..బ్రిటీష్ డైరెక్టర్ రిచర్డ్ ఆటిన్ బరో మహాత్మాగాంధీ బయోపిక్ తీసి తన జన్మ ధన్యం చేసుకొన్నాడు. అల్లూరి సీతారామరాజు సినిమా తీసిన కృష్ణ గారు నభూతో న భవిష్యత్ అని తన జన్మ ధన్యం చేసుకొన్నాడు. ప్రజాకవి అయిన కాళోజీ నారాయణ అనే వ్యక్తి ఒక మామూలు వ్యక్తి కాదు ఒక శక్తి.తను తెలంగాణ కొరకు ఉద్యమాలే ఊపిరిగా బతికాడు. పేద ప్రజలకొరకు అహర్నిశలు కష్టపడుతూ వారికి  అండగా నిలబడిన  గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తి గురించి  సినిమా తియ్యాలి అంటే గట్స్ కావాలి.అలాంటి వ్యక్తి పై కాళోజీ బయోపిక్ పేరుతో సినిమా తీసిన ప్రభాకర్ జైనీ దంపతులు కూడా వారి జన్మ ధన్యం అయిందనుకుంటున్నాను .
ప్రపంచంలో ఎం జరిగినా ఆది తన బాధ గా భావించే శ్రీ శ్రీ గారు కాళోజీ గారు రచించిన నా గొడవ నవల చూసి ఇది కాళోజీ గొడవ కాదు విశ్వ జగత్ గొడవ  అన్నారంటే కాళోజీ గారు ఎంత గొప్ప వ్యక్తో మనం అర్థం చేసుకోవచ్చు. అలాంటి మహానుభావుడి జీవిత చరిత్రను ప్రేక్షకులకు పరిచయం చేయడం చాలా సంతోషంగా ఉంది.

అల్లూరి సీతారామరాజు పొట్టి, ఛత్రపతి శివాజీ పొట్టి, అయితే కృష్ణ గారు ఆ సినిమాలో నటించి అల్లూరి సీతారామరాజు అంటే ఇలానే ఉంటాడనేలా నటించి అందరినీ మెప్పించాడు. ఇప్పుడు కాళోజీ నారాయణరావు పాత్రధారి పొట్టి  అయినా సరే ఇలాగే ఉంటాడు అనేలా చాలా బాగా నటించిన మూల విరాట్  జన్మ కూడా ధన్యమైంది అని చెప్పవచ్చు. త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాను అందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
 
చిత్ర దర్శకుడు ప్రభాకర్ జైనీ  మాట్లాడుతూ..ప్రజాకవి కాళోజీ' సినిమా ఒక అసాధ్యమైన టాస్క్. అటువంటి సినిమా తీయలేరని అందరూ నాతోనే అన్నారు.  ఏదో ఉత్సాహంతో మొదలు పెట్టారు కానీ, సినిమా పూర్తి కాదని చాలా మంది అన్నారు. వేరే వాళ్ళు అనడం కాదు. సినిమా 2020 జనవరి, 29 న మొదలు పెట్టి వరంగల్లులో కాళోజీ గారి ఇంట్లో మొదటి షెడ్యూలు షూటింగు చేస్తున్నప్పుడే, ఈ సినిమాను నేను పూర్తి చేయలేమోనని నాకే అనిపించింది. అయితే పెద్ద నిర్మాతలకు మాత్రం ఇవన్నీ పీ నట్స్ తో సమానం. కానీ చిన్న నిర్మాతలకు మాత్రం ప్రతీరోజు ఒక జీవన్మరణ సమస్యే. కమర్షియల్ సినిమాలకు, బాగా తీస్తే, డబ్బులు వచ్చే అవకాశం ఉంది. కానీ, ఈ సినిమా భవిష్యత్తు ఏమౌతుందో తెలియదు. ఈ సినిమా కోసం మేము ఖర్చు పెట్టే ప్రతి  రూపాయి అత్యవసరం అయితేనే ఖర్చు పెడతాము. అదే సమయంలో సినిమా క్వాలిటీ కోసం ఎంతైనా ఖర్చు పెట్టాము. ఈ సినిమాకోసం ఎన్నో  కష్టాలను , బాధలను నాతో పాటు నా భార్య, నిర్మాత శ్రీమతి విజయలక్ష్మీ జైని అనుభవించింది. ఆమె నా కన్నా మానసికంగా దృఢసంకల్పం కలది. నన్ను తానే ప్రోత్సహించేది.
ఈ సినిమాలో రెండు పాటలకు సింగిల్ కార్డు లిరిక్ రైటర్ గా అవకాశం ఇవ్వమని బిక్కి కృష్ణ అడిగినప్పుడు నేను ముందు సంశయించాను. ఇది తెలంగాణా యాసను హైలైట్ చేయవలసిన సినిమా. కాళోజీకి పలుకుబడుల భాష అంటే ఇష్టమని నాకు తెలుసు. అందుకే, వేరే ఒక పాటల రచయితకు ప్రామీస్ చేసినా ఆయనకు సర్ది చెప్పి, బిక్కి కృష్ణ గారికే నాలుగు పాటలు రాయడానికి అనుమతించాను. పాటలు బాగా వచ్చినా, యాస సమస్యలు వచ్చాయి. వాటిని నేను సరిదిద్దిన తర్వాత, సినిమా అత్యద్భుతంగా వచ్చింది. పాటలు కూడా కాళోజీ ఔన్నత్యాన్ని పెంచే విధంగా, ప్రతీ తెలుగు వాడు గర్వించే విధంగా, 'ఇది రా మా భాష గొప్పతనం' అని చెప్పుకుంటూ తల ఎగరవేసేంత గొప్పగా వచ్చాయ అహంకారాన్ని చీల్చి చెండాడే సన్నివేశాలనుచూపించాము.మేము తీసిన ఈ సినిమాను మీరందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని అన్నారు.
పాటల రచయిత బిక్కి కృష్ణ మాట్లాడుతూ..ప్రజాకవి కాళోజీ' వర్ధంతి వేడుకలు ఈ రోజు ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది.దర్శకుడు ప్రభాకర్ జైనీ ఈ సినిమాను చాలా కష్టపడి ఇష్టపడి చేశారు.. ఉద్యమాలకు ఊపిరి వదిలినటువంటి గొప్ప కవి కాళోజి పై బయోపిక్ తీయడం గొప్ప విషయం. ఆయనకు మా కృతజ్ఞతలు అన్నారు.