బుధవారం, 1 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 22 జనవరి 2020 (10:40 IST)

#Pranam From Jaanu కూల్ అండ్ ఫీల్ గుడ్ సాంగ్.. (వీడియో)

విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన 96 చిత్రం కోలీవుడ్‌లో సంచలనాలు సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తెలుగులోకి రీమేక్ అవుతోంది. ఈ చిత్రం నుంచి ఇప్పటికే టీజర్ రిలీజ్ అయ్యింది. ప్రస్తుతం ఈ  చిత్రంలోని ప్రాణం సాంగ్ అవుట్ అయ్యింది. ప్రాణం అంటూ సాగే ఈ పాట కూల్ అండ్ ఫీల్ గుడ్‌లా అనిపిస్తోంది. ఈ పాటను చిన్మయి శ్రీపాద, గౌతమ్ భరద్వాజ్ ఆలపించారు. 
 
96 చిత్రం విజయవంతం కావడానికి గోవింద్ వసంత్ అందించిన సంగీతం ప్రధాన బలంగా మారగా.. జాను సినిమాకు అతనే మ్యూజిక్ కంపోజ్ చేస్తుండటం ప్లస్ పాయింట్. తమిళ్‌లో త్రిష, విజయ్ సేతుపతి చేసిన పాత్రలను తెలుగులో సమంత, శర్వానంద్‌లు చేస్తున్నారు. ఒరిజినల్ వెర్షన్‌ని డైరెక్ట్ చేసిన ప్రేమ్ కుమార్ ఈ చిత్రాన్ని తెలుగు రీమేక్‌కు దర్శకత్వం వహించాడు. 
 
శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌లో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్ పార్ట్ పూర్తి కావడంతో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను ముగించుకుని ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది చిత్ర యూనిట్. మరి ఈ సినిమా నుంచి విడుదలైన ప్రాణం పాటను ఓసారి వినండి.