గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 14 మార్చి 2024 (15:44 IST)

ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్ విలన్ గా నటించిన యమధీర టీజర్ లాంచ్ చేసిన నిర్మాత అశోక్ కుమార్

Komal Kumar, Rishika Sharma
Komal Kumar, Rishika Sharma
కన్నడ హీరో కోమల్ కుమార్ హీరోగా, ఇండియన్ క్రికెటర్ శ్రీశాంత్ నెగిటివ్ రోల్ ప్లే చేస్తూ రానున్న చిత్రం యమధీర. శ్రీమందిరం ప్రొడక్షన్స్ లో వేదాల శ్రీనివాస్ గారు తొలి చిత్రం గా వస్తున్న సినిమా యమధీర. ఈ సినిమాలో నాగబాబు, ఆలీ, సత్య ప్రకాష్ గారు, మధు సూధన్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. అయితే ఈ సినిమా టీజర్ ప్రముఖ నటులు & ప్రొడ్యూసర్ అయినటువంటి అశోక్ కుమార్ లాంచ్ చేశారు. 
 
`ఇది తన మొదటి చిత్రం అని, సినిమాల మీద ప్యాషన్ తో శ్రీమందిరం ప్రొడక్షన్స్ స్టార్ట్ చేశానని, ప్రేక్షకులు తమని ఆదరిస్తారని కోరుకుంటున్నాను. త్వరలోనే యమధీర సినిమా థియేటర్లో రిలీజ్ కానుంది అని ప్రొడ్యూసర్ వేదాల శ్రీనివాస్ తెలిపారు. 
 
ఈ సందర్భంగా అశోక్ కుమార్ మాట్లాడుతూ.,  శ్రీమందిరం ప్రొడక్షన్స్ లో తొలి చిత్రంగా వస్తున్న యమధీర చాలా బాగా ఆడాలని అలాగే మరెన్నో చిత్రాలు రావాలని అన్నారు. కన్నడలో 90కు పైగా సినిమాలలో నటించిన కోమల్ కుమార్ ఈ సినిమా లో కథానాయకుడిగా నటించడం విశేషం అన్నారు. క్రికెటర్ శ్రీశాంత్ ఫాస్ట్ బౌలర్ గా మైదానం లో చూపే దూకుడు ని   ప్రతినాయకుడిగా చూపించే అవకాశం ఉంది అన్నారు. ఆలాగే ఈ చిత్రం అజర్ బైజాన్, శ్రీలంక వంటి దేశాలతో పాటు మన దేశంలోని మైసూర్, చెన్నై, బెంగళూరు ఇతర ప్రాంతాలలో షూటింగ్ జరగడం విశేషం అని తెలిపారు.