మంగళవారం, 10 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 3 నవంబరు 2021 (14:29 IST)

పునీత్ రాజ్‌కుమార్ చివరి క్షణాల్లో ఎలా ఉన్నారు?

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ చివరి క్షణాల్లో ఎలా ఉన్నారన్నదానికి సంబంధించి వీడియో ఒకటి విడుదలైంది. శుక్రవారం ఉదయం వ్యాయమం చేస్తున్న సమయంలో పునీత్‏కు ఛాతిలో నొప్పి రావ‌డం, వెంట‌నే ఆయ‌న ఫ్యామిలీ డాక్ట‌ర్‌ని సంప్ర‌దించ‌డం, గుండె చ‌ప్పుడులో మార్పు గ‌మ‌నించిన ఆయ‌న వెంటనే విక్రమ్ ఆసుపత్రికి సమాచారం అందించ‌డం జ‌రిగింది. ఆసుప‌త్రికి వెళ్లే లోపే పునీత్ మ‌ర‌ణించాడ‌ని వార్త‌లు వ‌చ్చాయి.
 
అయితే, తాజాగా పునీత్ చివ‌రి క్ష‌ణాల‌కు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ వీడియో ఒకటి వైర‌ల్‌గా మారింది. పునీత్ త‌న ఇంటి నుంచి కారు వరకు తానే స్వయంగా నడుచుకుంటూ వెళ్లడం వీడియోలో స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది. పునీత్‌ కారు ఎక్కిన వెంటనే భార్య ఒడిలో పడుకున్నారు. ఐదు నిమిషాల ప్రయాణం అనంతరం విక్రమ్ ఆసుపత్రికి చేరిలోపు భార్య ఒడిలోనే పునీత్ కన్నుమూశారు.
 
పునీత్ తన ఫ్యామిలీ డాక్టర్ రమణారావు ఆసుపత్రి నుంచి కారు వరకు నడుచుకుంటు వెళ్లడం సీసీ టీవీ ఫుటేజ్‏లో రికార్డ్ కాగా, ఆ వీడియో ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు అప్పు చివ‌రి క్ష‌ణాలు అంటూ వీడియోని తెగ వైర‌ల్ చేస్తున్నారు. ఆ వీడియోలో అప్పు యాక్టివ్‌గానే ఉన్న‌ట్టు క‌నిపిస్తుంది.