శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By మోహన్
Last Updated : మంగళవారం, 2 ఏప్రియల్ 2019 (12:45 IST)

అది నా తప్పు కాదు, శృతి హాసన్‌దే అంటున్న నిర్మాత

తెలుగు సినిమా పరిశ్రమలో పేరున్న నిర్మాతల్లో పీవీపీ( ప్రసాద్.వి పొట్లూరి) ఒకరు. ఆయన నిర్మాతగా పెద్ద విజయాలను చవిచూసింది లేదు, కానీ కొన్ని ప్రతిష్టాత్మక చిత్రాలను మాత్రం నిర్మించారు. తాను నిర్మించిన చిత్రాల ద్వారా డబ్బులు పోగొట్టుకున్నాడు. 
 
పీవీపీ తాజాగా వైకాపాలో చేరి, ప్రస్తుతం విజయవాడ పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తుండడంతో ప్రత్యర్థులు ఆయనపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అయితే గతంలో పీవీపీకి హీరోయిన్ శృతి హాసన్‌కి మధ్య వివాదం తలెత్తిందని, ఆ విషయాన్ని ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి ఎన్నికలలో బలంగా విమర్శిస్తూ ఆయనపై దాడి చేస్తున్నారు. 
 
గతంలో శృతి హాసన్‌ని ఆర్ధిక వ్యవహారాల్లో పీవీపీ బెదిరించారు అని వస్తున్న కామెంట్స్ పై ఆయన క్లారిటీ ఇచ్చారు. "గతంలో నేను తీసిన ఊపిరి అనే సినిమాలో శృతి నటించాల్సి ఉంది కానీ ఆవిడ షూటింగ్ మధ్యలో నుండి వెళ్లిపోవడంతో ఆవిడకి ఇచ్చిన పారితోషికం వెనక్కి తీసుకున్నాము, కానీ నేను ఎక్కడా శృతీని బెదిరించలేదు. ఆ విషయంలో అసలు నా తప్పేమి లేదు. 
 
సమంత, అనుష్క, తమన్నా కూడా మాతో పని చేసారు కానీ వారు ఎప్పుడూ నా మీద అభియోగాలు మోపలేదు. నా మీద అనవసరంగా బురద చల్లడం ఆపితే మంచిది" అని ఆయన అన్నారు.