సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 20 జులై 2024 (17:00 IST)

దేవుడి దయ వల్ల నేను ఆరోగ్యంగా ఉన్నాను : ఆర్ నారాయణ మూర్తీ

R Narayana Murthy
R Narayana Murthy
విప్లవం, పోరాటం అంటూ ప్రజాపోరాటాలతో సినిమాలు తీసి కష్టే ఫలి అని నమ్మే ఆర్ నారాయణ మూర్తీ నోటి వెంట దేవుడి దయ అనే మాటలు వినిపించాయి. చాలామందికి తెలీని విషయం ఏమంటే.. ఆర్ నారాయణ మూర్తీ అమ్మవారి భక్తుడు. ఇక అసలు విషయానికి వస్తే. గత రెండు నెలలుగా ఆయన హుద్రోగానికి సంబంధించి చిన్న ఆపరేషన్ చేసుకున్నాడు. వైజాగ్ లో జరిగిన ఈ ఆపరేషన్ సక్సెస్ అయింది. అయితే హైదరాబాద్ వచ్చాక కొంచెం అస్వస్థతకు గురయ్యారు. 
 
వెంటనే ఆయన హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. కొంచెం ఇన్ ఫక్షన్ రావడంతో ఇలా జరిగిందని డాక్టర్లు ధ్రువీకరించారు. గతం వారంరోజులుగా అక్కడే వున్న మూర్తిగారు నేడు డిఛ్చార్జ్ అయ్యారు. 
 
ఈ సందర్భంగా నారాయణ మూర్తి మాట్లాడుతూ, దేవుడి దయ వల్ల నేను ఆరోగ్యంగా ఉన్నాను. నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బిరప్ప గారికి, అక్కడ డాక్టర్స్ కు సిబ్బందికి  నా హృదయ పూర్వక ధన్యవాదములు. నాక్షేమాన్ని కోరుకుంటున్న ప్రజా దేవుళ్లకు శిరస్సు వంచి దండం పెడుతున్నా అంటూ వ్యాఖ్యానించారు.
 
నిమ్స్ ఆసుపత్రిలో ఆయన వెంట ఆయన సోదరుడి కుమారుడు సపచర్యలు చేశారు. ఇక ఆర్. నారాయణ మూర్తి హైదరాబాద్ లోని ఒట్టినాగులపల్లిలో వుంటున్న తన ఇంటికి చేరుకున్నారు.