సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 12 ఏప్రియల్ 2024 (18:00 IST)

రాజమౌళి డైరెక్షన్‌లో స్టార్ క్రికెటర్ డేవిడ్ భాయ్!

rajamouli ss
rajamouli ss
కొద్దిసేపటి క్రితమే దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తన సోషల్ మీడియాలో సి.ఆర్.ఇ.డి.. అప్ గ్రేడ్ యు.పి.ఐ. యాడ్ లో కనిపించిన వీడియో పోస్ట్ చేశారు. ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఒక యాడ్‌లో కలిసి కనిపించారు. ఈ యాడ్‌లో డేవిడ్ వార్నర్ హీరోగా సినిమాను తెరకెక్కించడానికి రాజమౌళి ఎన్ని కష్టాలు పడ్డారో ఫన్నీగా చూపించారు.
 
rajamouli ss, davidwarner
rajamouli ss, davidwarner
ఈ యాడ్ ప్రారంభంలో ఎస్ఎస్ రాజమౌళి, డేవిడ్ వార్నర్‌కు కాల్ చేసి ‘మీ మ్యాచ్ టికెట్లలో డిస్కౌంట్ కావాలంటే ఏం చేయాలి?’ అని అడుగుతాడు. దానికి డేవిడ్ వార్నర్ ‘మీ దగ్గర క్రెడ్ యూపీఐ ఉంటేనే డిస్కౌంట్ లభిస్తుంది.’ అని చెప్తాడు. దానికి రాజమౌళి ‘ఒకవేళ నా దగ్గర మామూలు యూపీఐ ఉంటే’ అని తిరిగి ప్రశ్నించగా... ‘దానికి మీరు నాకు ఒక ఫేవర్ చేయాల్సి ఉంటుంది.’ అని వార్నర్ రిప్లై ఇస్తాడు.
 
davidwarner  action, dance
davidwarner action, dance
వెంటనే రాజమౌళి దర్శకత్వంలో ఆర్.ఆర్.ఆర్. తరహాలో గుర్రాలపై యుద్ధం చేస్తున్న సీన్ చూపించాడు. ఆ తర్వాత ఓ డాన్స్ కావాలంటూ అడగడంతో ఓ పాట కూడా చేయిస్తాడు. ‘మనకు ఆస్కార్ కూడా వస్తుందిగా’ అని వార్నర్  రాజమౌళిని అడుగుతాడు. ఇదంతా ఊహించుకున్న ఎస్ఎస్ రాజమౌళి చివర్లో సైలెంట్‌గా ‘నేను క్రెడ్ యూపీఐకి అప్‌గ్రేడ్ అవుతాను.’ అనడంతో యాడ్ ఎండ్ అవుతుంది.
 
ఫన్నీగా గ్రీన్ మ్యాట్ తో యాడ్ చేయడం, భోజనాల దగ్గర ఇద్దరి సంభాషణలు సరదాగా వున్నాయి. ఇవి.. ఓకే. మా మహేస్ బాబు సినిమా అప్ డేట్ ఎప్పుడు అని పలువురు నెటిజన్లు ప్రశ్నలు కురిపించారు.