శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By జె
Last Modified: శుక్రవారం, 25 జూన్ 2021 (22:19 IST)

మా అంటే ముందు నేనే.. రాజేంద్రప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు

తెలుగు సినీపరిశ్రమలో మా ఎన్నికలు ఇప్పుడు కాకరేపుతున్నాయి. ప్రధాన ఎన్నికలను తలపించేలా సినీపరిశ్రమలో ఎన్నికలు జరుగబోతున్నాయి. మొత్తం నాలుగు ప్యానల్స్.. నలుగురు ప్రముఖులు పోటీలో ఉన్నారు. ప్రకాష్ రాజ్ ఒక అడుగు ముందుకు వేసి తన ప్యానల్‌ను ప్రకటించేశారు.
 
ఇక మిగిలిన ముగ్గురు తమ ప్యానల్ సభ్యులను ప్రకటించాల్సి ఉంది. అయితే ఇలాంటి తరుణంలో తిరుమల శ్రీవారిని దర్సించుకున్నారు ప్రముఖ సినీనటుడు రాజేంద్రప్రసాద్. స్వామివారి దర్సనం తరువాత ఆలయం వెలుపల మీడియాతో ఆయన మాట్లాడారు. కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేశారు.
 
మా ఎన్నికలు జరుగుతున్నాయి. ఎవరి నమ్మకం వారిదే. గెలుపు ధీమాతో పోటీ చేసే వారందరూ ఉంటారు. కాబట్టి దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మా అసోసియేషన్ అంటే నేను ముందు.. మా ముందు మా తరువాత నేను ఉంటానంటూ తమాషాగా చెప్పారు రాజేంద్రప్రసాద్.
 
గతంలో రాజేంద్రప్రసాద్ మా అధ్యక్షుడిగా వ్యవహరించారు. అందుకే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాజేంద్రప్రసాద్‌తో ఫోటోలు తీసుకునేందుకు పోటీలు పడ్డారు భక్తులు. అందరితో ఫోటోలు తీసుకుంటూ రాజేంద్రప్రసాద్ ముందుకు సాగారు.