మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 22 నవంబరు 2020 (15:51 IST)

రజనీకాంత్‌కు మళ్లీ అస్వస్థత.. ఆందోళనలో ఫ్యాన్స్..

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ మరోసారి అస్వస్థత పాలయ్యాడు. దాంతో అభిమానులు కంగారు పడుతున్నారు. అప్పుడప్పుడూ ఈయన ఆరోగ్యం దెబ్బతింటూ ఉంటుంది. ఆ మధ్య విదేశాలకు కూడా వెళ్లొచ్చిన తర్వాత కాస్త కుదుటపడ్డారు. ఇపుడు మళ్లీ రజనీ తీవ్ర అస్వస్థతకు గురైనట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. 
 
కొన్నేళ్లుగా ఈయన అనారోగ్య సమస్యలతో బాధ పడుతూనే ఉన్నాడు. అందుకే కొన్నేళ్లుగా ఆయన చేస్తున్న సినిమాల సంఖ్య కూడా భారీగానే తగ్గించేసాడు. ఓ సినిమా పూర్తైన తర్వాత మరో సినిమాను మొదలు పెడుతున్నాడు. ఆ మొదలు పెట్టిన సినిమాలను కూడా చాలా నెమ్మదిగా పూర్తి చేస్తున్నాడు. 
 
ప్రస్తుతం ఈయన సిరుత్తై శివ దర్శకత్వంలో "అన్నాత్తై" సినిమా చేస్తున్నాడు. పక్కా మాస్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ చిత్ర షూటింగ్‌లో ఈ మధ్యే జాయిన్ అయ్యాడు. కరోనా జాగ్రత్తలు అన్నీ తీసుకుని ఈ చిత్ర షూటింగ్ చేస్తున్నాడు. 
 
మరోవైపు ఆయన రాజకీయాల్లో కూడా బిజీ అవ్వాలని చూస్తున్నాడు. పార్టీ ప్రకటించినా కూడా ఇప్పటి వరకు రజినీ యాక్టివ్ పాలిటిక్స్‌లోకి అయితే రాలేదు. ఆయన రావాలంటూ ఎప్పటి నుంచే అభిమానులు కోరుతున్నారు. కానీ ఆయన మాత్రం తన పని తాను చూసుకుంటున్నాడు. 
 
ఇదిలా ఉంటే తాజాగా ఈయన తీవ్ర జ్వరంతో బాధపడుతున్నట్టుగా కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా షూటింగ్ చేసాడు కాబట్టి కరోనా కానీ వచ్చిందేమో అని టెస్ట్ కూడా చేయించారు. అయితే అలాంటిదేం లేదని తెలుస్తుంది. 
 
కేవలం వైరల్ ఫీవర్ మాత్రమే వచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. ఆయనకు సోకింది సాధారణ జ్వరమే అని.. త్వరలోనే కోలుకుని అభిమానుల ముందుకు వస్తారని వెల్లడించారు. ఆయన ఆరోగ్యం త్వరగా కుదుటపడాలని అభిమానులు దేవున్ని ప్రార్థిస్తున్నారు.