శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 28 మే 2020 (15:50 IST)

రోజూ ఓ కప్పు ఘీ కాఫీ తాగుతాను.. అదే నా సీక్రెట్.. రకుల్ ప్రీత్ సింగ్ (video)

టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఫిట్ నెస్ విషయంలో రాజీ పడదు. ఇప్పటికే టాప్ హీరోల సరసన నటించిన ఈ భామ.. లాక్ డౌన్‍తో షూటింగ్స్ లేకపోవడంతో ఇంటికే పరిమితమైంది. కానీ హోమ్ వర్కవుట్లు చేస్తూ, గేమ్స్ ఆడుతూ, సినిమాలు చూస్తూ కాలక్షేపం చేస్తోంది. ఇంట్లో ఉంటున్నా శరీరంపై దృష్టి పెట్టింది. ఆరోగ్యాన్ని, అందాన్ని కాపాడుకుంటుంది.  
 
తాజాగా తన మార్నింగ్ రొటీన్ గురించి తెలియజేస్తూ ఓ వీడియోని పోస్ట్ చేసింది. ఈ వీడియోలో చెప్పినట్లు ప్రతి రోజూ కొన్ని నియమాలు పాటిస్తానని.. తనను అభిమానించే ఫ్యాన్స్ కూడా పాటిస్తే ఆరోగ్యం మీ సొంతం అని తెలియజేస్తోంది. ఉదయం నిద్ర లేవగానే అరలీటరు గోరువెచ్చని నీరు తాగుతానని చెప్పింది. కొంత సమయం తర్వాత రాత్రిపూట నానబెట్టిన మెంతులు, నల్లని ఎండు ద్రాక్షను తీసుకుంటాను. ఈ రెండూ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని రకుల్ ప్రీత్ సింగ్ వెల్లడించింది.
 
ఇక మెంతులు తినడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి. మరోవైపు నల్లని ఎండుద్రాక్ష తినడం వల్ల ఎముకలు ఆరోగ్యంగా మారతాయి. వాటిల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. నల్లని ఎండు ద్రాక్ష మహిళలకు ఎంతో అవసరం. ఆ తర్వాత ఓ కప్పు నెయ్యితో కాఫీ తాగుతాను. ఇది తనకు  చాలా ఇష్టమైన డ్రింక్ అంటూ వెల్లడించింది. ఇది లేకుండా తన రోజు ప్రారంభం కాదు. రెండేళ్ల నుంచి ఘీ కాఫీ తాగడం అలవాటు చేసుకున్నాను. ఇప్పుడది తన జీవితంలో భాగమైపోయిందని రకుల్ ప్రీత్ సీక్రేట్ చెప్పేసింది.