సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By TJ
Last Modified: శుక్రవారం, 1 డిశెంబరు 2017 (15:39 IST)

కులం పేరు చెబితే దాంతో కొట్టండి - రకుల్ ప్రీత్ సింగ్

అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్‌కు కోపమొచ్చింది. కులం గోడలను కూల్చేద్దామంటూ ఒక టీవీ ఛానల్ చేస్తున్న ప్రచారానికి రకుల్ తోడయ్యింది. కులం పేరు ఎవరైనా చెబితే వారిని చెప్పు తీసుకుని కొట్టండి. మనం బతికేది కులాల మీద కాదు. ఆ విషయం అందరూ తెలుసుకోవాలి. కులం అన్నం

అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్‌కు కోపమొచ్చింది. కులం గోడలను కూల్చేద్దామంటూ ఒక టీవీ ఛానల్ చేస్తున్న ప్రచారానికి రకుల్ తోడయ్యింది. కులం పేరు ఎవరైనా చెబితే వారిని చెప్పు తీసుకుని కొట్టండి. మనం బతికేది కులాల మీద కాదు. ఆ విషయం అందరూ తెలుసుకోవాలి. కులం అన్నం పెట్టదు, కులం సమాజంలో గౌరవం ఇవ్వదు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలంటూ కొన్ని సూచనలు చేసింది ఈ అందాల భామ.
 
అంతటితో ఆగలేదు. కులం గోడల్ని కూల్చేందుకు అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలి. ముఖ్యంగా యువతరం నడుం బిగించాల్సిన అవసరం ఉందంటూ పిలుపునిచ్చింది రకుల్. తెలుగు సినీపరిశ్రమలో అగ్ర హీరోయిన్‌లలో ఒకరుగా వున్న రకుల్‌లో ఉన్నట్లుండి ఈ స్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తం కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది.