ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 17 జులై 2024 (16:57 IST)

లండన్‌లో హీరో రామ్ చరణ్ మైనపు బొమ్మ..!!

ram charan
తెలుగు చిత్రపరిశ్రమ హీరోలైన ప్రభాస్, మహేశ్‌ బాబు, అల్లు అర్జున్ విగ్రహాలను మేడమ్‌ టుస్సాడ్స్‌ వాక్స్‌ మ్యూజియంలో ఇప్పటికే ఏర్పాటు చేశారు. తాజాగా ఈ జాబితాలో మరో టాలీవుడ్‌ హీరో రామ్ చరణ్‌ కూడా చేరుతున్నట్లు సమాచారం. లండన్‌లో ఉన్న మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం నిర్వాహకులు రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రామ్ చరణ్‌కి ఉన్న పాపులారిటీ, ఫాలోయింగ్‌ను గుర్తించి మ్యూజియం వారు చరణ్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారంటున్నారు.
 
"గేమ్ ఛేంజర్" సినిమాలో తన షెడ్యూల్ పూర్తి చేసుకున్న రామ్‌చరణ్‌ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఇటీవల ఫ్యామిలీతో కలసి అంబానీ ఇంట జరిగిన పెళ్లి వేడుకలకు వెళ్లిన రామ్‌చరణ్‌… అక్కడ నుండి స్పెషల్ ప్లైట్‌లో లండన్‌కు వెళ్లారు ఈ లండన్‌ టూర్‌కి ప్రధాన కారణం మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం ఆహ్వానమే అంటున్నారు. దాదాపు 2 వారాలు హాలీడే ట్రిప్ ఎంజాయ్ చేయాలని భావించిన రామ్‌చరణ్‌, మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం తయారు చేస్తున్న మైనపు బొమ్మకు అవసరమైన కొలతలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
 
అయితే, మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం ఏర్పాటు చేస్తున్న విగ్రహానికి మరో విశేషం ఉందని అంటున్నారు. రామ్ చరణ్ ఎంతో ఎక్కువగా అభిమానించే తన పప్పీ రైమ్‌ని పట్టుకుని ఉన్న విగ్రహాన్ని ఈ మ్యూజియం వాళ్లు ఏర్పాటు చేయబోతున్నారట.. మొత్తానికి రామ్‌చరణ్‌ మైనపు విగ్రహం లండన్‌లో ఏర్పాటు చేయడంపై మెగా ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. లండన్‌ నుంచి తిరిగి వచ్చిన వెంటనే బుచ్చిబాబు సినిమా వర్క్‌ను చరణ్ మొదలు పెట్టనున్నారు.