గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 16 డిశెంబరు 2019 (14:16 IST)

కేఏపాల్‌పై పరువు నష్టం దావా.. రామ్ గోపాల్ వర్మ ఫైర్

సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి కేఏపాల్‌పై విమర్శలు గుప్పించారు. ప్రపంచ యుద్ధాన్ని ఆపానని చెప్పుకుంటున్న పాల్.. తన సినిమా అమ్మ రాజ్యంలో కడప బిడ్డలును ఆపలేకపోయారనే ఎద్దేవా చేశారు. తన సినిమా విడుదలకు ఆటంకాలు కలిగించిన ఆరుగురిపై పరువు నష్టం కేసులు పెడతామని తెలిపారు.
 
సినిమా విడుదలకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత కూడా తన చిత్రంపై కొందరు ఆరోపణలు చేశారని వీరి వెనుక ఎవరున్నారో తనకు తెలుసని తెలిపారు. వీరి వల్ల తన సినిమా విడుదల ఆలస్యమైందని మండిపడ్డారు. తన చిత్రం కులాల మధ్య చిచ్చు పెట్టేలా వందని.. టైటిల్ అభ్యంతరకరంగా వుందంటూ నమోదైన కేసులను కోర్టు కొట్టేసిందని వర్మ చెప్పారు.
 
ఎవరెవరైతే ఆటంకాలు కలిగించారో, డబ్బు తీసుకుని తమను ఇబ్బంది పెట్టారో వారిపై కేసులు వేయబోతున్నామని వర్మ తెలిపారు. వీరిలో ఇంద్రసేనా చౌదరి, కేఏ పాల్, సెన్సార్ అధికారిణి జ్యోతిలు కూడా ఉన్నారని చెప్పారు. వీరందరిపైనా రూ.20 కోట్లకు పరువు నష్టం దావా వేస్తామని తెలిపారు.