గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 28 మార్చి 2024 (14:03 IST)

హద్దులు దాటిన సినీ హీరోల అభిమానం

Ramcharan abhimani
Ramcharan abhimani
హీరోల పుట్టినరోజు అంటే చాలు అభిమానులు అందులో ముఖ్యంగా మగవారు తెగ సంబరాలు చేస్తుంటారు. మహిళలు అయితే వాటికి దూరంగా వుంటుండేవారు. ఇదంతా ఒకప్పటి కథ. కానీ నేటి ట్రెండ్ మారింది. తమ అభిమాన హీరోలంటే మహిళలు కూడా ముందుంటున్నారు. ఆ అభిమానం ఇండియా దాటి హద్దులు దాటేస్తుంది. అలా అమెరికా, జపాన్ తదితర ప్రాంతాల్లో తెలుగు హీరోలకుంటే అభిమానం చేస్తే ఆశ్చర్యపోకమానదు. తాజాగా నిన్న రామ్ చరణ్ పుట్టినరోజున జపాన్ కు  చెందిన మహిళా అభిమాని పినౌకుసి వినూత్నంగా తన అభిమానాన్ని చాటుకుంది.
 
charan birthday decaration
charan birthday decaration
రూమ్ అంతా తన ఇంటిలోనివారి పుట్టినరోజులా డెకరేష్ చేసి రామ్ చరణ్ కుచెందిన ఫొటోలు పెట్టి. గేమ్ ఛేంబర్ లో జరగండి.. పాటలోని ఓస్టిల్ ను పెట్టుకుని పూజచేసి, పాదాభివందనాలు చేయడం విశేషం. పుట్టినరోజు శుభాకాంక్షలు. మేము నిన్ను ప్రేమిస్తున్నాము మరియు మీ పుట్టినరోజును జరుపుకోవడం సంతోషంగా ఉంది. మీరు మరియు మీ కుటుంబం ఎడతెగని ఆనందంతో ఆశీర్వదించబడాలి. మేము ఎప్పుడూ మీ అభిమానులమే. అంటూ ట్వీట్ కూడా చేసింది.