ఆర్.జీ.వీకి తిక్కలేదు లెక్కలేదు అంటూ ప్రచారం
RGV pracharam
మరోవైపు చంద్రబాబు నాయుడు ఫొటోను పెట్టి.. కళ్ళు తుచుకుంటూ.. ఇక ఈ టెన్షన్ తట్టుకోలేకపోతున్నా.. అంటూ రిలీజ్ కోసం ఆయన ఎదురుచూస్తున్నట్లుగా పబ్లిసిటీ చేసుకున్నాడు వర్మ. ఏప్రిల్ లో ఎ.పి.లో ఎన్నికలు జరగుతాయని అనుకుంటుండగా మార్చిలో రెండు సినిమాలు విడుదలయి ఆ ప్రభుత్వానికి ఏదో హెల్ప్ అవుతుందని వర్మ ఆశిస్తున్నాడు. మరి ఆయన తీసిన పలు సినిమాలు కేవలం పబ్లిసిటీకే పరిమితం అయిన సందర్భాలు వున్నాయి.
టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు ఏ తరహా సినిమాలు చేస్తున్నాడో చూస్తున్నాం. ఇక ఇపుడు పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లోనే సినిమాలు చేస్తుండగా తాను లేటెస్ట్ గా చేసిన రెండు సినిమాలు “వ్యూహం”, “శపథం” చిత్రాలు రిలీజ్ కానున్నాయి. అయితే ఈ చిత్రాలు గత ఏడాదిలో ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉండగా మొదట ఒకో చిత్రానికి గ్యాప్ నెల ఉండేలా ప్లాన్ చేసుకున్నారు కానీ ఇది కాస్తా వాయిదాలు పడుతూ వారం రోజుల గ్యాప్ కి వచ్చింది. మరి ఈ సినిమాలు ఎలవుంటాయో అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
