బుధవారం, 11 సెప్టెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 3 ఆగస్టు 2024 (13:23 IST)

సూర్య, జ్యోతిక, కార్తీ బాటలో రష్మిక - వయనాడ్ విషాద విపత్తు కోసం 10 లక్షల విరాళం

Rashmika, Surya, Jyotika, Karti
Rashmika, Surya, Jyotika, Karti
నేషనల్ క్రష్ రష్మిక తన ఉదారతను  చాటుకుంది.  కేరళ ముఖ్యమంత్రి డిస్ట్రెస్ రిలీఫ్ ఫండ్‌కి 10 లక్షల రూపాయల మొత్తాన్ని విరాళంగా ఇచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.  కేరళ వయనాడ్ లో జరిగిన విషాద విపత్తు కోసం తన వాంస్తు సాయం చేసినట్లు తెలిపింది. 
 
వాయనాడ్ కొండచరియలు విరిగిపడటంతో మరణించిన వారి సంఖ్య 256కి చేరుకుంది, ఇంకా 200 మందికి పైగా గల్లంతయ్యారు
సూర్య, జ్యోతిక, కార్తీ కలిసి రూ.50 లక్షల విరాళం అందించారు. నేడు రష్మిక మందన్న రూ.10 లక్షల విరాళం అందించారు. కాగా, అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన పుష్ప 2 విడుదలకు సిద్ధం కానుంది.