ఆదివారం, 8 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 28 మార్చి 2022 (16:09 IST)

రష్మిక మందనకు Kids Choice Award 2022-శ్రీవల్లి హ్యాపీ హ్యాపీ

టాలీవుడ్ టాప్ హీరోయిన్ రష్మిక మందన తనపై ప్రేమను కురిపించిన.. తనను అనుకరించే చిన్నారులకు థ్యాంక్స్ చెప్పింది. చిన్నారులకు గాను ఫేవరేట్ యాక్ట్రస్‌గా అవార్డు కొట్టేసిన పుష్ప హీరోయిన్ రష్మిక మందన బుల్లిబొమ్మలైన చిన్నారులకు థ్యాంక్స్ చెప్పింది. 
 
వివరాల్లోకి వెళితే... పుష్పలో రష్మిక మందన నటన అద్భుతమనే పేరు కొట్టేసింది. ఆమె నటనకు, డ్యాన్సుకు చిన్నారులు ఫిదా అయ్యారు. పుష్పలోని సామి పాటను అనుకరిస్తూ వీడియోలు పోస్టు చేశారు. దీంతో పాటు చిన్నారుల ఫ్యాన్స్ పుష్పతో ఆమెకు అధికమయ్యారు. 
 
అంతేగాకుండా పుష్ప హీరోయిన్ బెస్ట్ యాక్ట్రస్, కిడ్స్ ఛాయిస్ అవార్డు 2022ని కైవసం చేసుకుంది.  నికోల్డియన్ ఇండియా నిర్వహించిన ఈ అవార్డుల కార్యక్రమంలో  పుష్ప సినిమాకు గాను రష్మిక మందన ఈ అవార్డును సొంతం చేసుకుంది. 
 
ఈ సందర్భంగా రష్మిక మందన తన చిన్ని ఫ్యాన్సుతో పాటు అందరికీ ధన్యవాదాలు తెలిపింది. ఇంకా ఆర్గనైజర్లు, దర్శకులు, సహనటులు, నిర్మాతలు ఫ్యాన్సుకు ధన్యవాదాలు తెలియజేసింది. 
 
ఇంకా రష్మిక మాట్లాడుతూ..  నికోల్డన్ తనను కిడ్స్ ఛాయిస్ అవార్డు కోసం ఎంపిక చేయడం పట్ల ధన్యవాదాలు తెలిపింది. ఈ అవార్డు కోసం తనకు ఓటేసిన చిన్నారులైన ఫ్యాన్సు థ్యాంక్స్ చెప్పింది. 
 
ఇకపోతే.. పుష్ప ది రైజ్‌తో జాతీయ స్థాయి తారగా ఎదిగిన రష్మిక ప్రస్తుతం మిషన్ మంజు అనే బాలీవుడ్ సినిమాలో నటిస్తోంది. అంతేగాకుండా సిద్ధార్థ్ మల్హోత్రా గుడ్ బై సినిమాలో అమితాబ్ బచ్చన్‌తో కలిసి నటిస్తోంది. పుష్ప-2 షూటింగ్‌లోనూ ఆమె పాల్గొనబోతోంది