ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 15 మార్చి 2024 (16:02 IST)

రెజీనాకు నిశ్చితార్థం.. ఎంగేజ్‌మెంట్ అంటూ ట్యాగ్..

regina
టాలీవుడ్ హీరోయిన్ రెజీనా కసాండ్రాకు నిశ్చితార్థం జరిగిందని ప్రచారం సాగుతోంది. ఆమె త్వరలో పెళ్లి చేసుకోబోతుందంటూ పలు వార్తలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఓ బిజినెస్ మ్యాన్‌ను రెజీనా పెళ్లి చేసుకోబోతుందంటూ ఈ నెల ప్రారంభంలో ప్రచారం జరిగింది. 
 
శివ మనస్సులో శృతి చిత్రంతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ పిల్లా నువ్వులేని జీవితం, రోటీన్ లవ్ స్టోరీ, రారా కృష్ణయ్య, పవర్, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, శౌర్యం, సౌఖ్యం, రీసెంట్‌గా శాకినీ డాకినీ చిత్రాలతో అలరించింది. 
 
తాజాగా సోషల్ మీడియాలో కొన్ని ఫొటోస్ షేర్ చేస్తూ ఎంగేజ్‌మెంట్ అని ట్యాగ్ చేసింది. పోలింగ్ ఫర్ ఎంగేజ్‌మెంట్ అంటూ ట్యాగ్ చేసిన రెజీనా.. స్టన్నింగ్ ఫొటోస్ పంచుకుంది. ఈ ఫోటోస్ నెట్టింట వైరల్ అవుతోంది.