శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 2 జూన్ 2020 (18:32 IST)

'ఆర్ఆర్ఆర్' నిర్మాత దానయ్యకు హార్ట్ అటాక్!!?

ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయన్ను హైదరాబాద్ నగరంలోని ఓ కార్పోరేట్ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వైద్య వర్గాల సమాచారం. అయితే, ఇది వారం రోజుల క్రితం జరుగగా, ఇపుడు వెలుగులోకి వచ్చింది. 
 
వారం రోజుల క్రితం డీవీవీ దానయ్యకు స్వల్పంగా గుండెపోటు వచ్చింది. దీంతో ఆయనకు యాంజియోప్లాస్టీ చేశారు. ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా వుంచారు. అయితే, ఇపుడు లీక్ కావడంతో సినీ ఇండస్ట్రీ పెద్దలు అనేక మంది ఆయనకు ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితిని వాకబు చేస్తున్నారు. 
 
కాగా, తన సొంత నిర్మాణ సంస్థ డీవీవీ బ్యానర్ పతాకంపై రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో ఆర్ఆర్ఆర్ మూవీని తెరక్కిస్తున్న విషయం తెల్సిందే. ఈ చిత్రానికి ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు హీరోలుగా నటిస్తుంటే, బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్, రే స్టీవ్‌సన్, అలిసన్ డూడీ, సముద్రఖనిలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్ నటి అలియా భట్, ఒలీవియా మోరిస్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.