సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 29 మే 2023 (14:12 IST)

అరికొంబన్‌పై సినిమా.. రిటర్న్ ఆఫ్ ది కింగ్.. 20మంది చంపింది..

Arikomban
Arikomban
గత ఐదేళ్లుగా కేరళను వణికిస్తున్న అడవి ఏనుగు అరికొంబన్ కథను మలయాళంలో తెరకెక్కించనున్నారు. ఈ అరికొంబన్ ఏనుగు కథను ఫోకస్ చేస్తూ మలయాళంలో అరికొంబన్ పేరుతో ఓ సినిమా చేయబోతున్నారు. సాజిత్ యాహియా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పోస్టర్ విడుదల కాగా, ఈ సినిమా షూటింగ్ శ్రీలంకలో జరగనుందని సమాచారం.
 
కేరళలోని ఇడుక్కి జిల్లాలోని కేరళ-తమిళనాడు సరిహద్దు గ్రామాలను గత ఐదు సంవత్సరాలుగా ఒక్క అడవి అరికొంబన్ బెదిరిస్తోంది. చిన్నకనాల్, చందనపారై సహా పలు ప్రాంతాలను ఆక్రమించి ఇళ్లు, వ్యవసాయ భూములను దోచుకున్న అరికొంబన్ ఇప్పటి వరకు 20 మందిని చంపింది. 
 
ఇటీవల తేని జిల్లా అటవీ సరిహద్దుల్లోకి ప్రవేశించిన అరికొంబన్ రేషన్ దుకాణాన్ని ధ్వంసం చేసింది. 'రిటర్న్ ఆఫ్ ది కింగ్' అనే ట్యాగ్‌లైన్‌లో మేకర్స్ అరికొంబన్‌ను రాజుగా పరిచయం చేశారు.