సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వాసు
Last Updated : సోమవారం, 18 మార్చి 2019 (12:54 IST)

టీవీ ఛానెల్ పెడుతున్న స్టార్ హీరో?

ఇప్పటివరకు రాజకీయ నాయకులు, పార్టీలు తమకు అనుకూలమైన వార్తల కోసం... తమ కార్యకలాపాల కవరేజీల కోసం... సొంతం ఛానెల్‌లను అందునా వార్తా ఛానెల్‌లను పెట్టుకోవడం మాత్రమే చూసిన మనకు ఇది కాస్త వింతగానే అనిపించవచ్చు... కానీ, ఒక స్టార్ హీరో టీవీ ఛానెల్ పెట్టబోతున్నారట.
 
వివరాలలోకి వెళ్తే... కొన్నాళ్ల క్రితమే సినిమా, టీవీ ప్రొడక్షన్ రంగంలోకి అడుగిడిన బాలీవుడ్ స్టార్ హీరో కండల వీరుడు సల్మాన్ ఖాన్ మరో ముందడుగు వేసి ఇప్పుడు టీవీ ఛానెల్ ప్రారంభించబోతున్నాడు. ప్రస్తుతం శాటిలైట్ ఛానెల్ లైసెన్స్ తీసుకునే పనుల్లో బిజీగా ఉన్న ఆయన అలాగే అందులో ప్రసారం చేసేందుకు తన పాత సినిమాల శాటిలైట్ హక్కుల్ని కూడా కొంటున్నాడట. కాగా... సదరు ఛానెల్ పేరు 'ఎస్కె టీవీ' అని ఉండవచ్చుననే ప్రచారం సాగుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.