శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By కుమార్
Last Updated : శుక్రవారం, 15 మార్చి 2019 (12:31 IST)

సల్మాన్ సినిమా చేస్తే రూ. 100 కోట్ల వసూళ్లు గ్యారంటీ

సల్మాన్ ఖాన్ సినిమాలు ఫ్లాప్ అయినా రూ.100 కోట్లు ఎలా రాబడుతాయో తనకు ఆశ్చర్యంగా ఉందంటున్నాడు బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్. ఈమధ్యనే ఒక బాలీవుడ్ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో టైగర్ ష్రాఫ్ ఈ విషయాన్ని ప్రస్తావించాడు. తన తదుపరి సినిమాలు, ఇతర నటీనటుల గురించి చర్చించిన సందర్భంలో తాను సల్మాన్ ఖాన్‌ను ఒక ప్రశ్న అడగాలని అనుకుంటున్నానని ష్రాఫ్ చెప్పాడు.
 
తనకు ఎప్పటి నుంచో ఒక సందేహం ఉందని, సల్లూ భాయ్ సినిమాలు ఏ రేంజ్‌లో ఫ్లాప్ అయినా కూడా 100 కోట్ల రూపాయల కలెక్షన్లు రాబడతాయని, సల్మాన్ భాయ్‌కు ఇది ఎలా సాధ్యపడుతుందో ఆశ్చర్యంగా ఉంటుందని చెప్పాడు. సల్మాన్‌కు అంతటి క్రేజ్ ఎలా వచ్చింది. అలా ప్రేక్షకుల్లో పాపులారిటీ సంపాదించుకోవడానికి ఆయన ఏమి చేస్తాడు అని టైగర్ ష్రాఫ్ ప్రశ్నించాడు.
 
గతంలో సల్మాన్ ఖాన్ లవ్ యాత్రి అనే సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా తన సినిమాలు ఫ్లాప్ అయినా 100 కోట్లు రాబడతాయని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను గుర్తు చేసుకుంటూ టైగర్ ష్రాఫ్ సల్మాన్‌కు ఈ ప్రశ్న వేసారు. మేమైతే రూ.100 కోట్లు వసూలు చేయాలంటే చాలా కష్టపడతాం. సల్మాన్‌కు రూ.100 కోట్లు అవలీలగా వచ్చేస్తాయని వ్యాఖ్యానించారు.