మంగళవారం, 21 అక్టోబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Last Updated : మంగళవారం, 21 అక్టోబరు 2025 (10:39 IST)

Samyuktha: ది బ్లాక్ గోల్డ్ లో రక్తపు మరకలతో రైల్వే ఫ్లాట్ పై సంయుక్త ఫస్ట్ లుక్

The Black Gold is an action drama starring Samyukta
The Black Gold is an action drama starring Samyukta
లక్కీ చార్మ్ సంయుక్త ఫస్ట్ ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్ యోగేష్ కెఎంసి దర్శకత్వంలో చేస్తున్నారు. ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సామజవరగమన, ఊరు పేరు భైరవకోన వంటి విజయవంతమైన చిత్రాలు అందించిన నిర్మాత రాజేష్ దండా నిర్మిస్తున్నారు. హాస్య మూవీస్, మాగంటి పిక్చర్స్ తో కలిసి చేస్తున్న ఆరవ సినిమా ఇది. సంయుక్త స్వయంగా ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. సింధు మాగంటి సహ నిర్మాత. నిన్న ఈ మూవీ టైటిల్ 'ది బ్లాక్ గోల్డ్' అని అనౌన్స్ చేశారు.
 
దీపావళి సందర్భంగా చిత్రానికి సంబంధించిన ఇంటెన్స్, గ్రిప్పింగ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. చేతిలో పిస్టల్, టీషర్ట్‌, చేతులపై రక్తపు మరకలతో రైల్వే ఫ్లాట్ పై సంయుక్త కనిపించింది.
 
రైల్వే స్టేషన్ అంతా శవాలతో నిండిపోయి, ఇంటెన్స్ ఫైట్ జరిగిందని సూచిస్తుంది. “Welcome” అని రాసిన బోర్డు కింద సీలింగ్‌కి వేలాడుతున్న వ్యక్తి కనిపించడం పోస్టర్‌కి మరింత క్యురియాసిటీ పెంచింది. సంయుక్త ఇప్పటివరకు చూడని యాక్షన్ అవతార్‌లో చూపించబోతోందని ప్రామిస్ చేస్తోంది. .
 
దర్శకుడు యోగేశ్ KMC సంయుక్తని  నెవర్-సీన్-బిఫోర్ అవతార్‌లో చూపించే పవర్‌ఫుల్ స్క్రిప్ట్ రాశారు. ఆమె చేసిన హై-ఆక్టేన్ స్టంట్స్ ప్రేక్షకులను షాక్‌కి గురి చేయబోతున్నాయి.
 
ఈ చిత్రానికి ట్యాలెంటెడ్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. ఎ వసంత్ కెమెరా మ్యాన్ కాగా, సామ్ సిఎస్ సంగీతం అందిస్తున్నారు. సాహి సురేష్ ప్రొడక్షన్ డిజైనర్, చోటా కె ప్రసాద్ ఎడిటర్. రామ్ కృష్ణ యాక్షన్ డైరెక్టర్. యోగేష్ కెఎంసితో పాటు, కథ సంభాషణలను ప్రసాద్ నాయుడు రాశారు. దర్శకుడు స్వయంగా స్క్రీన్‌ప్లే రాశారు. మధు విప్పర్తి స్క్రిప్ట్ కోఆర్డినేటర్.
 
ప్రస్తుతం సినిమా హైదరాబాద్‌లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఫస్ట్ లుక్ పోస్టర్ ద్వారా మేకర్స్ ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం హిందీ భాషల్లో పాన్ ఇండియా విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు.