సందీప్ కిషన్, రావు రమేష్ ప్రధాన పాత్రలతో త్రినాధ రావు నక్కిన చిత్రం ప్రారంభం
sundeep kishan, clap by dil raju
'ఊరు పేరు భైరవకోన' విజయాన్ని ఆస్వాదిస్తున్న హీరో సందీప్ కిషన్ తన ల్యాండ్‌మార్క్ 30వ చిత్రం #SK30 కోసం ధమాకా దర్శకుడు త్రినాధ రావు నక్కినతో చేతులు కలిపారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ , హాస్య మూవీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. సామజవరగమన, ఊరు పేరు భైరవకోన వంటి వరుస హిట్‌లను అందించిన ప్రొడక్షన్ హౌస్ వారి కాంబినేషన్‌లో హ్యాట్రిక్ హిట్‌లను పూర్తి చేయబోతోంది. పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని రాజేష్ దండా నిర్మిస్తుండగా, బాలాజీ గుత్తా సహ నిర్మాతగా వ్యవహరించనున్నారు.
ఈ రోజు, #SK30 గ్రాండ్‌గా ప్రారంభమైయింది. ముహూర్తం వేడుకకు విజయ్ కనకమేడల కెమెరా స్విచాన్ చేయగా, దిల్ రాజు క్లాప్ కొట్టారు. అనిల్ సుంకర తొలి షాట్‌కి గౌరవ దర్శకత్వం వహించారు.
త్రినాధరావు నక్కిన విజయవంతమైన ప్రయాణంలో భాగమైన రచయిత ప్రసన్న కుమార్ బెజవాడ #SK30కి కథ, స్క్రీన్‌ప్లే డైలాగ్ రైటర్‌గా పని చేస్తున్నారు. ఈ కొత్త సినిమా త్రినాథరావు నక్కిన, ప్రసన్నల మార్క్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోంది.
సందీప్ కిషన్ క్యారెక్టరైజేషన్ గత చిత్రాల కంటే డిఫరెంట్ గా ఉంటుంది. రావు రమేష్ కీలక పాత్రలో కనిపించనున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ చిత్రానికి లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తుండగా, నిజార్ షఫీ డీవోపీగా పని చేస్తున్నారు. బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్.