శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : గురువారం, 21 అక్టోబరు 2021 (17:58 IST)

శ‌శి ప్రీత‌మ్ -లైఫ్‌ ఆఫ్ 3 నుండి నువ్వు నాకు న‌చ్చావే వీడియో సాంగ్ విడుద‌ల‌ (video)

Life of 3 still
ప్రముఖ సంగీత దర్శకుడు, యాడ్‌ ఫిల్మ్‌ మేకర్‌ శశి ప్రీతమ్‌ దర్శకుడిగా పరిచయమవుతున్న చిత్రం 'లైఫ్‌ ఆఫ్ 3`. స్నేహాల్‌ కామత్‌, వైశాలి, సంతోష్‌ అనంతరామన్‌, చిన్నికృష్ణ ప్రధాన పాత్రల్లో నటించారు. శ‌శి ప్రీత‌మ్ ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ ప్లే అందించడంతో పాటు ఛాయాగ్రహణ, సంగీత, దర్శకత్వ బాధ్యతలను కూడా  నిర్వర్తించారు. ఆయ‌న కూతురు ఐశ్వర్య కృష్ణ ప్రియ నిర్మించారు. ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. తాజాగా ఈ చిత్రం నుండి నువ్వు నాకు న‌చ్చావే పాట‌ను విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌..
 
``స‌రికొత్త రాగాలెందుకు వ‌చ్చాయి..ఎద‌లోన భావాలెందుకు తెచ్చాయి. రంగుల‌లో రంగుని ఎందుకు పెంచాయి..ముందెన్న‌డు తెలియ‌ని హాయిని పంచాయి..నువ్వేనా దీనికి మూలం..తెలియ‌ని ఈ ఆరాటం.. తెలిసింది...ఈ క్ష‌ణ‌మే నీతో ఉంటేనే...న‌వ్వు నాకు న‌చ్చావే..న‌వ్వు నాకు న‌చ్చావే..న‌వ్వు నాకు న‌చ్చావే..న‌చ్చావే``అంటూ ఆహ్లాదంగా సాగే ఈ పాట‌కు శ‌శి ప్రీత‌మ్ మ‌రోసారి అంద‌మైన బాణీల‌ను స‌మ‌కూర్చారు. ఎన్‌సీ కారుణ్య ఆల‌పించారు. ఈ పాట ప్ర‌స్తుతం సంగీత ప్రియుల్ని అల‌రిస్తూ సోష‌ల్ మీడియాలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. 
 
Shashi Pritam -
శ‌శి ప్రీత‌మ్ మాట్లాడుతూ - ``ఈ కథ ప్ర‌ధానంగా ముగ్గురు వ్యక్తుల జీవితం గురించి ఉంటుంది. సినిమా ప‌రిశ్ర‌మకు చెందిన ముగ్గురు వ్య‌క్తులు దర్శకుడు, రచయిత మరియు నటుడి జీవితంలో జ‌రిగే సంఘ‌ట‌న‌ల ఆధారంగా సినిమాను తెర‌కెక్కించ‌డం జ‌రిగింది. ఇది హార‌ర్ ఎలిమెంట్స్‌తో కూడిన సస్పెన్స్ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ స్టోరీ. సినిమా ఆధ్యంతం ఉత్కంఠ‌భ‌రితంగా సాగుతుంది``అన్నారు
 
తారాగ‌ణం: స్నేహాల్‌ కామత్‌, సంతోష్‌ అనంతరామన్‌, చిన్నికృష్ణ, వైశాలి, సౌజ‌న్య వ‌ర్మ‌, సీవీఎల్‌, లోహిత్ కుమార్‌, వైభ‌వ్ సూర్య‌, జోసెఫ్ సుంద‌ర్ త‌దిత‌రులు
 
సాంకేతిక వ‌ర్గం: కో- ప్రొడ్యూస‌ర్: దుశ్యంత్ రెడ్డి, అసోసియేట్ ప్రొడ్యూస‌ర్: అశోక్ బ‌డ్డి & డా. పెరుమ‌ళ్లు మ‌లినేని,  ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: విశ్వ‌నాథం వి,  నిర్మాత‌: ఐశ్వ‌ర్య కృష్ణ ప్రియ‌, సంగీతం, సినిమాటోగ్ర‌ఫి, స్టోరి, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం: శ‌శి ప్రీత‌మ్.