ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 9 డిశెంబరు 2024 (07:55 IST)

జానీ మాస్టర్ పోస్ట్ కు చెక్ పెట్టిన శేఖర్ మాస్టర్- జోసెఫ్ ప్రకాశ్ విజయం

Sekar, johny
Sekar, johny
డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఎన్నికలు నిన్న ఆదివారంనాడు హైదరాబాద్ లోని అసోసియేషన్ కార్యాలయంలో జరిగాయి. జానీ మాస్టర్ అధ్యక్షుడిగా వున్న పదవికి జరిగిన ఈ ఎన్నికలు ఇనానమస్ గా జరగాలనీ, జోసెఫ్ ప్రకాశ్ ను అధ్యక్షుడిగా ఎంపిక చేయాలని డాన్సర్స్ అసోసియేషన్ కార్యవర్గం తీర్మానించింది. కానీ కొందరు విభేదించడంతో ఆ పోస్ట్ కు ఎన్నిక అనివార్యమైంది. నిన్న జరిగిన ఎన్నికల్లో రమేష్ మాస్టర్ డాన్సర్ కూడా పోటీకి దిగడంతో ఎన్నిక తప్పనిసరి అయింది.
 
జోసెఫ్ ప్రకాశ్ కు శేఖర్ మాస్టర్ తోపాటు పలువురు మాస్టర్లు సపోర్ట్ గా నిలిచారు. దాంతో చిన్నపాటి పోటీ ఏర్పడ్డా ఫైనల్ గా జోసెఫ్ ప్రకాశ్ ఎన్నికయ్యారు. ఈ పదవి కేవలం 11 నెలలు మాత్రమే వుంటుంది. ఇంతకుముందున్న జానీ మాస్టర్ పై వచ్చిన లైంగిక వేధింపుల కారణంగా జైలుకు వెళ్ళడంతో అప్పటినుంచి ఆయనకు సభ్యత్వం తీసివేయాలని అసోసియేషన్ తీర్మానించింది. అందుకు కొంత సమయం పట్టడంతో ఏకంగా డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ నుంచి శాశ్వతంగా తొలగించారు. బెయిల్ పై వచ్చిన జానీ మాస్టర్ మరలా అసోసియేషన్ లో పట్టు సంపాదించడానికి కోర్టు ద్వారా  ప్రయత్నాలు చేయనున్నారని తెలియడంతో అసోసియేషన్ ఆయనపై శాశ్వత వేటు వేసినట్లు తెలిసింది. అయితే అప్పటికే మూడు పర్యాయాలు జోసెఫ్ మాస్టర్ ఓడిపోవడంతో సింపతీ కూడా వర్కవుట్ అయిందని డాన్సర్లు తెలియజేస్తున్నారు.