మంగళవారం, 26 సెప్టెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 25 ఆగస్టు 2022 (15:55 IST)

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన హీరో.. ఎవరితను?

Navazuddin
నవాజుద్దీన్ సిద్ధిఖీ తను పోషించే పాత్రలో జీవిస్తాడని చాలామందికి తెలుసు. తాజాగా అతడు నటిస్తున్న 'హడ్డీ' చిత్రంలో మోషన్-పిక్చర్ పోస్టర్‌తో అభిమానులను షాక్‌కు గురి చేసాడు. స్త్రీలా దుస్తులు ధరించాడు. ఇది చూసిన సిద్ధిఖీ అభిమానులు ఎంతకీ నమ్మడంలేదు.

 
ఈ చిత్రం యొక్క మోషన్ పోస్టర్ మంగళవారం విడుదలైంది. ఇందులో నవాజ్ గ్రాఫైట్ మెటాలిక్ కలర్ గౌనులో సరిపోయే ఆర్మ్-గేర్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. మోషన్ పోస్టర్ విడుదలపై నవాజ్ చెపుతూ... నేను చాలా ఆసక్తికరమైన పాత్రలను పోషించాను, కానీ "హడ్డీ" అసాధారణమైన, ప్రత్యేకమైన పాత్ర కానుంది. ఎందుకంటే నేను ఎప్పుడూ చూడని రూపాన్ని కలిగి ఉంటాను. చిత్రీకరణ ప్రారంభం కోసం ఎదురు చూస్తున్నాను.

 
“హడ్డీ” చిత్రం అక్షత్ అజయ్ శర్మ రాసిన కథ. ఈ చిత్రానికి ఆయనే దర్శకత్వం వహిస్తున్నారు.