సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శనివారం, 25 మే 2019 (11:27 IST)

హీరోగా సుడిగాలి సుధీర్.. ధన్యా బాలకృష్ణతో రొమాన్స్

జబర్దస్త్ షోలో సుడిగాలి సుధీర్‌కు మంచి క్రేజుంది. అతనికి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువ. ఈ నేపథ్యంలో జబర్దస్త్ షో ద్వారా మంచి పేరు కొట్టేసిన సుధీర్ హీరోగా తెరంగేట్రం చేయనున్నారు. జబర్దస్త్, ఢీ, పోవే పోరా లాంటి షోలతో బుల్లితెరకు చేరువైన సుధీర్.. రాజశేఖర్‌ రెడ్డి పులిచర్ల దర్శకుడిగా పరిచయం అవుతున్న సినిమాలో నటించనున్నారు. 
 
ఇందులో ధన్యా బాలకృష్ణ కథానాయిక పాత్ర పోషిస్తున్నారు. శేఖర ఆర్ట్‌ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఇంద్రజ, షాయాజీ షిండే, పోసాని కృష్ణ మురళి ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాను జులై చివరి వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సినీ యూనిట్ ప్రకటించింది. ''సాఫ్ట్‌వేర్ సుధీర్'' పేరిట ఈ సినిమా తెరకెక్కనుంది.