గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 13 జూన్ 2022 (15:49 IST)

మరోమారు కలకలం సృష్టించిన డ్రగ్స్ - హీరోయిన్ సోదరుడు అరెస్టు

arrest
బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ కలకలం మళ్లీ చెలరేగింది. గతంలో డ్రగ్స్ మాఫియా కేసులో పలువురుని అరెస్టు చేశారు. మరికొందరు సినీ సెలెబ్రిటీల వద్ద ముంబై నార్కోటిక్స్ విభాగం పోలీసులు విచారణ జరిపారు. ఇది దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 
 
గత యేడాది షారూఖ్ తనయుడు ఆర్యన్ ఖాన్ మీద డ్రగ్స్ కేసు నమోదైన విషయం తెల్సిందే. ఈ కేసులో అతనికి ఇటీవలే క్లీన్ చిట్ వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా మరోమారు మాదక ద్రవ్యాల వ్యవహారం వెలుగు చూసింది. 
 
బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ హీరోయిన్ శ్రద్ధా కపూర్ సోదరుడు, సీనియర్ నటుడైన శక్తి కపూర్ కుమారుడు సిద్ధాంత్ కపూర్ ఈ వివాదంలో చిక్కుకున్నాడు. ఆదివారం రాత్రి బెంగుళూరులోని ఎంజీ రోడ్డులోని ఓ హోటల్‌లో రేవ్ పార్టీ జరుగుతున్నట్టు పోలీసులకు పక్కా సమాచారం వచ్చింది. 
 
దీంతో పోలీసులు అక్కడ తనిఖీలు చేసి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో సిద్ధాంత్ కపూర్ కూడా ఉన్నారు. ఈయనకు జరిపిన వైద్య పరీక్షల్లో డ్రగ్స్ తీసుకున్నట్టు తేలింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికావాల్సివుంది.