గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 21 జనవరి 2022 (19:50 IST)

ఓటీటీలో శ్యామ్ సింగరాయ్.. 21నుంచి నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్

నాని, సాయిపల్లవి, కృతిశెట్టి నటించిన శ్యామ్ సింగరాయ్ చిత్రం థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకుంది. థియేట్రికల్ రన్ ముగియడంతో శ్యామ్ సింగరాయ్‌ చిత్రాన్ని తెలుగు, బెంగాళీ భాషల్లో ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. 
 
ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్ ద్వారా జనవరి 21న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. రాహుల్ సంకిృత్యన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఓటీటీలో విడుదల కావడంపై నాని ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. 
 
క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 24న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయం సాధించింది. నాని సరసన కృతిశెట్టి, సాయిపల్లవి జంటగా నటించారు. దేవదాసి పాత్రలో సాయి పల్లవి నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది. మడోన్నా సెబాస్టియన్‌ కీలక పాత్రలో నటించింది.
 
కలకత్తా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందించగా, నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై ప్రొడక్షన్‌ నెంబర్‌ వన్‌గా వెంకట్‌ బోయనపల్లి నిర్మించారు.