శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : గురువారం, 22 ఏప్రియల్ 2021 (20:57 IST)

‘మేజ‌ర్‌’ సినిమా కోసం ఆరు భారీ సెట్లు

Avinash kolla
అడివి శేష్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం `మేజ‌ర్`‌. శ‌శి కిర‌ణ తిక్క ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని మహేష్ బాబు GMB ఎంటర్టైన్మెంట్ మరియు ఏప్ల‌స్ఎస్‌ మూవీస్ సహకారంతో సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా నిర్మిస్తోంది. 26/11 ముంబై న‌గ‌రంలో జ‌రిగిన టెర్ర‌ర్ ఎటాక్స్‌లో త‌న ప్రాణాల‌ను ప‌ణంగా ప్ర‌జ‌ల‌ను కాపాడిన ఆర్మీ ఆఫీస‌ర్ మేజ‌ర్ సందీప్ ఉన్నికృష్ణ‌న్ పాత్ర‌ను పోషిస్తున్నారు హీరో అడివి శేష్‌. రీసెంట్‌గా విడుద‌లైన ఈ సినిమా టీజ‌ర్ అన్ని భాష‌ల‌లో  ట్రెమండ‌స్ రెస్పాన్స్‌తో  సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో పాన్ ఇండియా మూవీగా మేజ‌ర్ విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది.
 
రియ‌ల్ ఇన్‌సిడెంట్స్‌ను ఆధారంగా చేసుకుని డైరెక్ట‌ర్ శ‌శికిర‌ణ్ తిక్క అండ్ టీమ్  ఈ స్క్రిప్ట్‌ను
త‌యారు చేసుకున్నారు. అందుకు త‌గిన‌ట్లు భారీ సెట్స్‌ను వేసి సినిమాను చిత్రీక‌రిస్తున్నారు. మ‌హాన‌టి వంటి నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ మూవీకి ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌గా ప‌నిచేసిన అవినాష్ కొల్ల‌, మేజ‌ర్ సినిమాలోని స‌న్నివేశాల‌ను రియ‌లిస్టిక్‌గా క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు చూపించ‌బోతున్నారు. 
 
అందుకోసం ఆరు భారీ సెట్స్ వేశారు. అందులో ముంబైలోని గేట్ వే ఆఫ్ ఇండియా సెట్..ఎన్ఎస్‌జీ కమాండో సెట్‌ల‌ను హైద‌రాబాద్‌లోని ఓ ప్రైవేటు స్టూడియోలో వేశారు. ఇక  ఈ సినిమాకు వేసిన భారీ సెట్స్‌లో తాజ్ మ‌హాల్ ప్యాలెస్ సెట్ హైలెట్ అని చెప్పొచ్చు. 2008లో జ‌రిగిన టెర్ర‌ర్ ఎటాక్ తాజ్ హోట‌ల్‌లోనే జ‌రిగింది. ఈ స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించేట‌ప్పుడు ప్రేక్ష‌కుల‌కు రియ‌ల్ లొకేష‌న్ ఫీలింగ్‌ క‌లిగించ‌డానికి రియ‌ల్ హోట‌ల్ ఎలా ఉందో అలాంటి సెట్‌నే అవినాష్ కొల్ల వేశారు.
 
నిజానికి ముంబైలోని తాజ్ హోట‌ల్‌లో స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించాల‌ని యూనిట్ అనుకున్న‌ప్ప‌టికీ వారికి ప‌ర్మిష‌న్ దొర‌క్క‌పోవ‌డంతో, సెట్‌ను వేశారు. నాలుగైదు రోజుల పాటు చిత్ర యూనిట్ తాజ్ హోట‌ల్ ఆర్కిటెక్చ‌ర్‌ను ప‌రిశీలించారు. ప్ర‌తి చిన్న విష‌యాన్ని కూడా సునిశితంగా ప‌రిశీలించ‌డ‌మే కాకుండా, సెట్‌ను వేయ‌డానికి ఎంతో రీసెర్చ్ చేశారు.  ఐదు వంద‌ల మంది దాదాపు  ప‌ది రోజుల పాటు శ్ర‌మించి ఈ భారీ సెట్‌ను నిర్మించారు. 
 
ఈ సంద‌ర్భంగా.అవినాష్ కొల్ల మాట్లాడుతూ, ‘మేజర్ సినిమా కోసం ఆరు భారీ సెట్స్ వేశాం. ప్రతి సెట్ వేసే క్రమంలో మా టీమ్ ఎంతో రీసెర్చ్ చేసుకుని, డిజైన్స్ తయారు చేసుకుని ముందుకెళ్లాం. ముఖ్యంగా తాజ్ పాలెస్ సెట్ వేయ‌డానికి బాగా క‌ష్ట‌ప‌డ్డాం. అడివి శేష్‌, స్టోరిని నెరేట్ చేసేట‌ప్పుడు తాజ్ హోట‌ల్  ప్రాధాన్య‌త‌ను వివ‌రించారు. సినిమాలో అదొక సెట్ ప్రాప‌ర్టీలాగా కాకుండా క్యారెక్ట‌ర్‌లా ఊహించుకోవాల‌ని చెప్పాడు. శేష్‌, చెప్పిన ప్ర‌తి చిన్న విష‌యాన్ని నోట్ చేసుకుని, రియ‌ల్ తాజ్ ప్యాలెస్‌లా మా సెట్‌ను వేశాం. తాజ్‌లో గ్రాండ్ స్టెయిర్ కేస్‌, టాటా ఐకానిక్ ఇమేజ్‌, ఎం.ఎఫ్.హుస్సేన్ పెయిటింగ్స్ వంటి వాటిని ‌రీ క్రియేట్ చేశాం. 120 అడుగుల ఎత్తుతో ఐదు ఫ్లోర్స్ హోట‌ల్ సెట్‌ను ఫైబ‌ర్‌, ఉడ్‌, ఐర‌న్ ఉప‌యోగించి త‌యారు చేశాం’. ఈ సెట్స్ ఆడియ‌న్స్‌కి స‌రికొత్త అనుభూతిని పంచ‌నున్నాయి``అన్నారు.