గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 24 నవంబరు 2017 (14:29 IST)

బండ్ల గణేష్‌కు ఆరు నెలల జైలుశిక్ష

నంది అవార్డులు ఇవ్వడంలో మెగా ఫ్యామిలీకి అన్యాయం జరిగిందని వ్యాఖ్యానించిన ప్రముఖ వ్యాపారవేత్త, సినీ నిర్మాత బండ్ల గణేష్‌కు ఆరు నెలల జైలుశిక్ష ఖరారైంది. ఈ మేరకు ఎర్రమంజిల్ కోర్టు ఆరునెలల జైలు శిక్ష విధి

నంది అవార్డులు ఇవ్వడంలో మెగా ఫ్యామిలీకి అన్యాయం జరిగిందని వ్యాఖ్యానించిన ప్రముఖ వ్యాపారవేత్త, సినీ నిర్మాత బండ్ల గణేష్‌కు ఆరు నెలల జైలుశిక్ష ఖరారైంది. ఈ మేరకు ఎర్రమంజిల్ కోర్టు ఆరునెలల జైలు శిక్ష విధిస్తూ..తీర్పు వెలువరించింది. జైలు శిక్షతో పాటు రూ.15లక్షల జరిమానా కూడా విధించింది. 
 
టెంపర్ సినిమాకు కథ అందించిన వక్కంతం వంశీ రూ.25లక్షల రూపాయలకు సంబంధించిన చెక్ బౌన్స్ కేసులో ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు.. బండ్ల గణేష్‌కు ఆరునెలలు జైలుశిక్ష విధించడంతో పాటు షరతులతో కూడిన బెయిల్‌ను న్యాయస్థానం మంజూరు చేసింది.  
 
కాగా.. ఎన్టీఆర్, కాజల్ హీరో హీరోయిన్లుగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన టెంపర్ సినిమాను బండ్ల గణేష్ పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్ బ్యానర్‌పై నిర్మించిన సంగతి తెలిసిందే. నటుడిగా కెరీర్ ప్రారంభించిన బండ్ల గణేష్, రవితేజ హీరోగా తెరకెక్కిన ఆంజనేయులు సినిమాతో నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. ఆపై పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు నిర్మించి బ్లాక్ బస్టర్ నిర్మాతగా గుర్తింపు సంపాదించాడు.