మంగళవారం, 28 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 27 డిశెంబరు 2020 (13:49 IST)

దుమ్మురేపుతున్న సాయితేజ్ "సోలో బ్రతుకే సో బెటర్"

మెగా ఫ్యామిలీ హీరో సాయితేజ్ నటించిన తాజా చిత్రం సోలో బ్రతుకే సో బెటర్. ఈ చిత్రం ఈ నెల 25వ తేదీన క్రిస్మస్ పండుగ రోజున ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. కరోనా లాక్డౌన్ తర్వాత థియేటర్లు తెరుచుకున్నారు. ఈ థియేటర్లలో విడుదలైన తొలి చిత్రంగా ఈ చిత్రం మిగిలిపోయింది. 
 
సాయితేజ్ సరసన నభా నటేష్ నటించగా, నూతన దర్శకుడు సుబ్బు తెరకెక్కించాడు. అయితే, ఈ చిత్రం విడుదలైన తొలి రోజు నుంచే సక్సెస్‌ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతోందని ట్రేడ్ వర్గాలంటున్నాయి. ఓపెనింగ్స్ అదిరిపోవడంతో, తొలిరోజే రూ.4 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన ఈ చిత్రం, రెండోరోజు కూడా అదే దూకుడు కనబరిచింది. రెండో రోజున ఈ చిత్రం రూ.3.29 కోట్ల గ్రాస్ రాబట్టింది.
 
అటు, తెలుగు రాష్ట్రాల్లో రెండ్రోజుల షేర్ రూ.4.8 కోట్లు సాధించింది. మొత్తమ్మీద సాయితేజ్ కొత్త చిత్రం రెండ్రోజుల్లో రూ.7.99 కోట్ల గ్రాస్‌తో నిర్మాతలను ఆనందోత్సాహాల్లో ముంచెత్తుతోంది. అది కూడా 50 శాతం ప్రేక్షకులతోనే ఈ ఘనత సాధించడం విశేషం అని చెప్పాలి.