అన్నాత్తైకి రాత్రి పూట షూటింగ్‌కు అనుమతి.. కర్ఫ్యూ సమయంలో..?

Rajinikanth
Rajinikanth
సెల్వి| Last Updated: శుక్రవారం, 23 ఏప్రియల్ 2021 (11:34 IST)
తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతూ పోతుండడంతో ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ విధించింది. రాత్రి 9 గంటల నుండి ఉదయం 5 గం.ల వరకు ఈ కర్ఫ్యూ ఉంటుందని వారు తెలిపారు. అయితే కర్ఫ్యూ వలన చాలా చిత్ర షూటింగ్స్ వాయిదా పడ్డాయి. రజనీకాంత్ నటిస్తున్న అన్నాత్తె చిత్ర షూటింగ్‌కు కూడా ఇబ్బంది కలుగుతుంది. ఈ క్రమంలో వారు పోలీసుల నుండి ప్రత్యేక అనుమతి కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది.

అన్నాత్తె చిత్ర షూటింగ్ కోసం రజనీకాంత్ ఇటీవల హైదరాబాద్‌కు వచ్చారు. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో చిత్ర షూటింగ్ జరుగుతుంది. దీపావళికి చిత్రాన్ని విడుదల చేయాలనే భావనలో మేకర్స్ ఉండగా, వీలైనంత తొందరగా మూవీని పూర్తి చేయాలని అనుకుంటున్నారు. ఇందుకోసం కర్ఫ్యూ సమయంలోను షూటింగ్ చేసేందుకు అనుమతిని కోరుతున్నారని తెలిసింది.

కళానిధి సమర్పణలో సన్‌ పిక్చర్స్ పతాకంపై నిర్మితమవుతున్న ఈ చిత్రంకు డి.ఇమ్మాన్‌ సంగీత స్వరాలు అందిస్తున్నారు. వెట్రి పళనిస్వామి సినిమాటోగ్రాఫర్‌. ఎడిటర్‌గా రూబెన్‌ వ్యవహరిస్తున్నారు. కరోనా ఉదృతంగా ఉన్న ఈ సమయంలో రజనీకాంత్ షూటింగ్ చేయడం గొప్ప విషయమే.దీనిపై మరింత చదవండి :