గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వాసు
Last Updated : సోమవారం, 18 మార్చి 2019 (11:58 IST)

నేను సీతను కాదు.. కానీ పవన్ కళ్యాణ్ రావణాసురుడు..

వివాదాల విషయంలో ముందుంటే శ్రీరెడ్డి ఇటీవల జరిగిన ఇంటర్వ్యూలో మరోసారి మెగాఫ్యామిలీ, దగ్గుబాటి ఫ్యామిలీని టార్గెట్ చేసింది. మెగా ఫ్యామిలీ తాను క్యాస్టింగ్ కౌచ్‌పై సాగిస్తున్న పోరాటాన్ని తొక్కేసారని ఆరోపించారు. వేధింపులకు గురైన మహిళల తరఫున తాను పోరాటం చేస్తుంటే సినీ వర్గాల నుండి ఎలాంటి మద్దతు లభించలేదని, పైగా నేను పవన్‌ను తిట్టిన ఒక్క మాట పట్టుకుని ఫిలిం ఛాంబర్‌లో నానా హంగామా చేసి, మహిళను తిట్టానంటూ నాపై విమర్శలు చేసి, నా పోరాటాన్ని నీరుకార్చారు. నేను సీతను కాకపోవచ్చు గానీ, పవన్ మాత్రం రావణాసురుడు. అంతేకాకుండా పవన్ పార్టీ జనసేన అధికార ప్రతినిధి అద్దెపల్లి శ్రీధర్‌ టీడీపీ నాయకురాలిని తిట్టడం కరెక్టేనా? మీకొక న్యాయం, మిగతావారికొక న్యాయమా? అంటూ శ్రీరెడ్డి ప్రశ్నించారు.
 
నేనేం నా కోసమో, నా ఫ్యామిలీ కోసమో ఈ ఉద్యమం చేయడం లేదు. సినిమా ఇండస్ట్రీలోని మహిళల కోసం చేస్తుంటే, ఎవరూ మద్దతు ఇవ్వడం లేదు. సినీ పెద్దలకు ఇదేమీ పట్టదు. నా శాపం వలనే దగ్గుబాటి కుటుంబం నానాకష్టాలు ఎదుర్కొంటోంది. రానా ఆరోగ్యం విషయంలో ఆ కుటుంబానికి చాలాపెద్ద దెబ్బ తగిలింది. ఇప్పుడిప్పుడు రానా ఆరోగ్యం కుదుటపడుతోంది.

మళ్లీ ఆ ఫ్యామిలీని ఇక టార్గెట్ చేయదల్చుకోలేదు. అభిరామ్‌ను అయితే ఇక్కడ ఉండనీయకుండా ఎక్కడికో పంపించారు. తెలంగాణ ప్రభుత్వం నాకు జరిగిన అన్యాయానికి సుమాటోగా కేసు స్వీకరించాలి, కానీ అలా చేయలేదు. నేను డబ్బు తీసుకుని తమిళనాడు చెక్కేసానని నాపై వస్తున్న ఆరోపణలను నిరూపిస్తే, మీడియా ముందు బట్టలు విప్పినట్లుగానే ఈసారి గొంతు కోసుకుంటానంటూ సవాలు విసిరారు.