శుక్రవారం, 21 జూన్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 11 అక్టోబరు 2021 (11:52 IST)

'మా' ఫలితాలపై శ్రీకాంత్ కామెంట్స్...

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్స్‌కు ఆదివారం ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల ఫలితాల్లో హీరో మంచి విష్ణు ప్యానెల్ విజయం సాధించింది. అయితే, ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి ఎగ్జిక్యూటివ్ అధ్యక్షుడుగా హీరో శ్రీకాంత్ విజయం సాధించారు. 
 
ఆ తర్వాత శ్రీకాంత్ ఈ ఫలితాలపై స్పందిస్తూ, తనను నమ్మారు కాబట్టే ఓటు వేసి గెలిపించారని అన్నారు. అయితే తాను గెలిచినప్పటికీ ప్రకాశ్ రాజ్ ఓడిపోవడం బాధ కలిగిస్తోందని తెలిపారు.
 
'మా' కోసం తాము ఎంతో చేయాలని ప్రణాళికలు రూపొందించుకున్నామని, గత రెండు నెలలుగా తాము కలిసి ప్రయాణించామని పేర్కొన్నారు. తమ బృందం మా పీఠం ఎక్కలేకపోవడం కొంచెం నిరాశ కలిగించే విషయమన్నారు. 
 
ఇది కూడా ఓ సినిమా అనుకుని వెళ్లిపోవడమేనని శ్రీకాంత్ అభిప్రాయపడ్డారు. అదేసమయంలో మా నూతన అధ్యక్షుడు మంచు విష్ణుకు అభినందనలు తెలిపారు. మంచు విష్ణు ప్యానెల్ సభ్యులు మా బాధ్యతలను స్వీకరించనున్నారు.