ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 10 డిశెంబరు 2021 (15:14 IST)

'ఆర్ఆర్ఆర్'కు భారీ స్పందన.. ఏం మాట్లాడాలో అర్థం కాలేదు : రాజమౌళి

తాను దర్శకత్వం వహించిన "ఆర్ఆర్ఆర్" చిత్రం ట్రైలర్‌కు వస్తున్న స్పందన పట్ల ఏం మాట్లాడాలో అర్థంకా వడం లేదని దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ట్వీట్ చేశారు. ఈయన దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు హీరోలుగా, అజయ్ దేవగన్ ప్రత్యేక పాత్రలో నటించిన "ఆర్ఆర్ఆర్" చిత్రం వచ్చే నెల 7వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం ట్రైలర్‌ను గురువారం విడుదల చేశారు. 
 
ఈ ట్రైలర్‌కు స్పందన అదిరిపోయింది. ఒక్క తెలుగులోనే ఇప్పటికే 21 వేల మిలియన్ వ్యూస్‌ వచ్చాయి. ఇందులో కొమరం భీమ్‌గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా చెర్రీలు నటించారు. 'బాహుబలి' చిత్రం తర్వాత రాజమౌళి దర్శకత్వం వహించిన చిత్రం కావడంతో దీనిపై భారీ అంచనాలే నెలకొన్నాయి. 
 
ఈ నేపథ్యంలో గురువారం ఈ చిత్రం ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. దీనికి భారీ స్పందన వస్తుంది. దీనిపై దర్శకుడు ట్వీట్ చేశారు. అన్ని ప్రాంతాల నుంచి "ఆర్ఆర్ఆర్" ట్రైలర్‌కు వస్తున్ స్పందనతో మా టీమ్ అంతా చాలా ఎంజాయ్ చేస్తుంది. ఈ భారీ స్పందన పట్ల ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు. ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు అంటూ ట్వీట్ చేశారు.