గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 2 జూన్ 2022 (12:36 IST)

గీతా ఆర్ట్స్ గేటుకు వేలాడుతూ సినీ నటి బోయ సునీత ఆందోళన

Sunita Boya, Bunny Vass
కొన్నాళ్ళ క్రితం అర్థ నగ్నంగా గీతా ఆర్ట్స్ కార్యాలయం యెదుట ఆందోళన చేసిన ఆ సినీ నటి, తాజాగా మళ్ళీ ఇంకోసారి గీతా ఆర్ట్స్ కార్యాలయం వద్ద గేటుకు వేలాడుతూ ఆందోళన చేయడం సంచలనం రేపుతోంది. 
 
పని గట్టుకుని పదే పదే సదరు నిర్మాత మీద సినీ నటి బోయ సునీత ఆరోపణలు చేయడంపై పోలీసులకు ఎలా స్పందించాలో అర్థం కావడంలేదు. ఆమె మానసిక స్థితిగా సరిగ్గా లేదనే వాదనలు తరచూ తెరపైకొస్తున్నాయి. ఓ రాజకీయ పార్టీని కూడా సదరు సినీ నటి బోయ సునీత వివాదంలోకి లాగడం గమనార్హం.
 
ఇంతకీ, ఆరోపణలు ఎదుర్కొంటున్న నిర్మాత ఎవరో కాదు.. బన్నీ వాసు. బన్నీ వాసు, గీతా ఆర్ట్స్ బ్యానర్ అధినేత అల్లు అరవింద్‌కి అత్యంత సన్నిహితుడు. జీఎ2 పిక్చర్స్ పతాకంపై సినిమాలు నిర్మిస్తుంటాడు బన్నీ వాసు.
 
గతంలో జనసేన పార్టీ తరఫున బన్నీ వాసు పని చేశాడనీ, ఆ సమయంలో తనను బన్నీ వాసు మోసగించాడనీ బోయ సునీత ఆరోపించింది.